Prathap Pothen Passes Away Aged 69 నిన్నటితరం దక్షిణాది నటుడు ప్రతాప్ పోతన్ ఇక లేరు.!

Malayalam actor prathap pothen passes away aged 69

Pratap Pothen, Prathap Pothen, Death, Malayalam actor Death, Bangalore Days actor death, Idduki Gold, Prathap Pothen, RIP Prathap Pothen, Director prathap Pothen, Malayalam cinema, Telugu, Tamil, Prathap Pothen Malayalam films, Prathap Pothen condolences, Pratap Pothen age, Pratap Pothen Tamil films, Chennai, Tamil Nadu, Kollywood, Movies, Entertainment

Malayalam actor and filmmaker Pratap Pothen passed away on Friday morning. He was 69. The actor was found dead in his Chennai apartment. The actor, who was an active presence in Malayalam, Tamil, Telugu and Hindi films from the 1980s, also made his mark in the industry as a scriptwriter, director and producer.

నిన్నటితరం దక్షిణాది నటుడు ప్రతాప్ పోతన్ ఇక లేరు.!

Posted: 07/15/2022 08:21 PM IST
Malayalam actor prathap pothen passes away aged 69

నిన్నటితరం ప్రేక్షకులకు సుపరిచితుడూన నటుడు ప్రతాప్ పోతన్ ఇక లేరు. ఆయన గుండెపోటు వచ్చి గత రాత్రి తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని తన అపార్టుమెంటులో ఆయన చనిపోయారు. వైవిధ్య భరితమైననటనతో నిన్నటితరం ప్రేక్షకులందరికీ ఇప్పటికీ గుర్తు. ప్రతాప్ పోతన్ తన కెరియర్ ఆరంభంలో హీరోగా చేసినప్పటికీ, ఆయన ఒక మంచి నటుడు అనే బాలచందర్ ప్రశంసించారు. కేవలం ఒకే ఒక స్మైల్ తోనే ఆయన తనలోని విలనిజాన్ని బయటపెట్టేవారు. కళ్లతోనే అద్భుతమైన హావభావాలు పలికించేవారు. చకచకా ఎక్స్ ప్రెషన్స్ మార్చే అరుదైన నటుల్లో ఆయన ఒకరుగా చెబుతారు.

కేరళలోని తిరువనంతపురంలో 1952 ఆగస్టు 13వ తేదీన ఆయన జన్మించారు. 1978లో మలయాళ సినిమా ద్వారా నటుడిగా వెండితెరకి పరిచయమయ్యారు. ముందుగా మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ వెళ్లిన ఆయన, ఆ తరువాత కాలంలో తమిళంలో బిజీ అయ్యారు. అడపా దడపా తెలుగు తెరపై కూడా మెరిశారు. 'ఆకలి రాజ్యం' .. 'కాంచనగంగ' .. 'జస్టీస్ చక్రవర్తి' వంటి సినిమాలు తెలుగులో ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే, 1985లో ప్రముఖ నటి రాధికను ఆయన వివాహం చేసుకున్నారు. అయితే, ఎంతో కాలం వారి వైవాహిక జీవితం సాగలేదు. దాంతో 1986లో ఆమె నుంచి విడాకులు పొందారు.

ఆ తర్వాత అమలా సత్యనాధ్ అనే కార్పొరేట్ ఉద్యోగిని వివాహమాడారు. వారికి ఒక అమ్మాయి వుంది. అయితే, 22 ఏళ్ల తరువాత 2012లో ఆమె నుంచి కూడా ప్రతాప్ విడాకులు తీసుకున్నారు. హీరోగా.. విలన్ గా.. కేరక్టర్ ఆర్టిస్టుగా నాలుగు దశాబ్దాలుగా ఆయన తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కథ .. స్క్రీన్ ప్లే .. దర్శకత్వంపై కూడా ఆయనకి మంచి పట్టుంది. డజను సినిమాలకి ఆయన దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ఆయన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. వివిధ భాషలకి చెందిన సినీ ప్రముఖులు.. సన్నిహితులు.. అభిమానులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles