కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో రాధేశ్యామ్, భీమ్లానాయక్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక సర్కారువారి పాట, ఫర్వాలేదని అనిపించినా.. ఆచార్య అంచనాలను అందుకోలేకపోయినా.. అభిమానులను మాత్రం అలరించాయి. ఈ క్రమంలో టాలీవుడ్ లో ప్రతివారం ఓ చిత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యాయి. కానీ ఒక్క సినిమా మాత్రం ఇంకా విడుదల తేదీపై క్లారిటి ఇవ్వటం లేదు. ఆ సినిమానే ‘విరాట పర్వం’.
అయితే ఇప్పుడు ఆ చిత్రం విడుదలపై కూడా క్లారిటీ వచ్చేసింది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నీదినాది ఒకేకథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ మూవీని అన్ని చిత్రాలతో పాటే వాయిదా వేశారు. మిగితా చిత్రాలు వరుసగా విడుదల అవుతుంటే, విరాట పర్వం మాత్రం ఇంకా విడుదలకు నోచుకోలేకపోతుంది. దీనికి ముఖ్య కారణం సరేష్‌బాబు అంటూ ప్రచారం సాగింది. సురేష్‌బాబు నారప్ప, దృశ్యం సినిమాల మాదిరిగానే విరాట పర్వం చిత్రాన్ని కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు గతం నుంచి ప్రచారం అవుతుంది.
అయితే ఈ వార్తలపై కూడా ఎలాంటి స్పష్టత అధికారికంగా లేకపోయినా.. చిత్రం విడుదలపై సస్పెన్స్ కొనసాగింది. దీంతో చిత్రం వర్గాలు మాత్రం ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల అవుతుందని పేర్కోన్నాయి. అయితే ద్వీతీరార్థం కాదు ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. విరాటపర్వం చిత్రాన్ని జూన్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ వీడియో పంచుకుంది. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న విరాటపర్వం చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more