Actress Krithi Shetty Cries DurIng Live Interview లైవ్ లో కంటతడి పెట్టిన బేబమ్మ.. యాంకర్స్ అతి..

South indian actress krithi shetty becomes emotional with anchors prank

Heroine Krithi Shetty, actress Krithi shetty becomes emotional, Krithi Shetty Cries DurIng Live Interview, Krithi shetty emotional with anchors prank, South Indian actress, Krithi shetty, emotional, Live interview, anchors prank, anchors trolled, kollywood, sandalwood, mollywood, tollywood, movies, Entertainment

In a recent Tamil Nadu interview, Krithishetti shed tears. Is that actress brave enough to cry? Do not think that .. She was moved to tears by the extreme behavior of the anchors. Giving an entry into the details of what actually happened .. During the interview two anchors competed with each other to ask Krithishetti questions. Then they started shouting at each other and got into a fight. Also one anchor hit another anchor.

లైవ్ లో కంటతడి పెట్టిన బేబమ్మ.. యాంకర్స్ అతి..

Posted: 05/30/2022 05:48 PM IST
South indian actress krithi shetty becomes emotional with anchors prank

ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న బేబమ్మ.. ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్','బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం రామ్‌తో నటించిన 'ది వారియర్' చిత్రం​ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే కాకుండా సుధీర్‌ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రంలోనూ నటిస్తోంది.

అంతేకాకుండా నితిన్‌ సరసన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా చేస్తోంది. కాగా తాజాగా తమిళనాట ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. అదేంటి నటిని.. ఏడిపించేంత ధైర్యమా.? అని అనుకోకండీ.. యాంకర్ల అతి ప్రవర్తన చూసి అమె కంటతడి పెట్టుకున్నారు. అసలేం జరిగిందన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. ఇంటర్వ్యూ జరుగుతుండగా ఇద్దరు యాంకర్లు కృతిశెట్టిని ప్రశ్నలు అడిగేందుకు ఒకరికొకరు పోటీ పడ్డారు. తర్వాత ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కృతిశెట్టి ఎదుటే గొడవకు దిగారు. అంతేకాకుండా ఒక యాంకర్‌ మరో యాంకర్‌ను కొట్టాడు.

దీంతో ఏం జరుగుతుందో తెలియని బేబమ్మ భయపడిపోయింది. అయితే ఆ తర్వాత అది ప్రాంక్‌ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది కృతిశెట్టి. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ఎందుకు ఏడ్చారు, ఏమైంది  అని ప్రశ్నించారు. దానికి ఎవరైన హార్డ్‌గా మాట్లాడితే తట్టుకోలేను, భయం వేస్తుంది అని చెప్పుకొచ్చింది 18 ఏళ్ల కృతిశెట్టి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh