Eminent singer KK passes away at the age of 53 విషాదంలో బాలీవుడ్.. నేపథ్య గాయకుడు కేకే హఠాన్మరణం..

Singer kk dies at 53 after live performance in kolkata voice of love is gone

KK death news,how kk die,how did kk die,did kk die,kk singer die,reason of kk demise,kk singer,singer KK death,KK family,KK wife,KK children,KK post-mortem,KK death live updates,KK death news from kolkata,KK,Krishnakumar Kunnath,Singer KK

Bollywood singer KK, who delivered successful songs such as Tadap Tadap (Hum Dil De Chuke Sanam), Kya Mujhe Pyaar Hai (Woh Lamhe), O Meri Jaan (Life In A… Metro), died of cardiac arrest, hours after performing at a concert in Kolkata’s Gurudas College in Nazrul Mancha. The 53-year-old reportedly complained of uneasiness and glare of light during the live stage performance. Krishnakumar Kunnath was brought to CMRI hospital.

విషాదంలో బాలీవుడ్.. నేపథ్య గాయకుడు కేకే హఠాన్మరణం..

Posted: 06/01/2022 11:49 AM IST
Singer kk dies at 53 after live performance in kolkata voice of love is gone

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ సంతోష సంబరాల్లో ఇంకా మునిగితేలుతుండగానే ఆయన మరణవార్త నమ్మలేకపోతున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మరణించారన్న వార్త వెలువడంతో ఇప్పటికీ ఇది నిజమేనా..? అన్న ప్రశ్న ఆయన అభిమానులు రేకెత్తుతోంది. 53ఏళ్ల కృష్ణ కుమార్​ కున్నథ్​, అభిమానులు 'కేకే' అని ప్రేమతో పిలిచుకుంటారు.

కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన తరువాత కొన్ని గంటల వ్యవధిలో తన హోటల్​లో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. అక్కడే చివరికి తుదిశ్వాస విడిచారు. ఆయతే అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కేకే అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు. 1990 లలో ‘పాల్’, ‘యారోన్’ సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంచలనం సృష్టించాయి. యువతలో ఆయన పాటలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. స్కూల్, కాలేజీ, కల్చరల్ ఈవెంట్స్‌లో ఎక్కువగా ఈ పాటలు వినిపించేవి.

హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ సహా పలు భాషల్లోనూ పాటలు పాడారు. కేకే మరణవార్త ఆయన అభిమానులను, ప్రముఖులు, సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కేకే మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని, అన్ని వయసుల వారిని అలరిస్తాయని అన్నారు. ఆయన పాటల ద్వారా ఎప్పటికీ కేకేను గుర్తుంచుకుంటామని అన్నారు. కేకే కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

చాలా విచారకరమని, కేకే మృతి వార్త తనను షాక్‌కు గురిచేసిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. కేకే మృతి తీరని లోటని పేర్కొన్నారు. కేకే పాటలు, ఆయన గాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయని గాయకుడు పాపాన్ అంగారాగ్ ట్వీట్ చేశారు. దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కేకే మరణవార్త వినాల్సి రావడం విషాదకరమని, జీవితం ఎంత దుర్భలమైందో ఆయన మరణం మరోమారు గుర్తు చేసిందని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles