Tollywood producer M. Ramakrishna Reddy passed away టాలీవుడ్ నిర్మాత రామకృష్ణారెడ్డి ఇకలేరు..

Tollywood producer m ramakrishna reddy passed away

Tollywood producer, M. Ramakrishna Reddy, long illness, MS Reddy, Vaikunthapali, Gadusupillodu, Sitapati Samsaram, Mavuri Devata, Alludugaru Zindabad, Agni Keratala, Fata Fat Jayalakshmi, Shobhanayudu, Abhimanavanthulu, Tollywood, movies, Entertainment

Tollywood Leading producer M. Ramakrishna Reddy has passed away. He died in Chennai on Wednesday after a long illness. As a producer, M. Ramakrishna Reddy has a special place in the film industry. Many film personalities mourned his death. Producer M. Ramakrishna Reddy has introduced Shobhanayudu and Fata Fat Jayalakshmi to the silver screen with Abhimanavanthulu.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత రామకృష్ణారెడ్డి ఇకలేరు.!

Posted: 05/26/2022 11:40 AM IST
Tollywood producer m ramakrishna reddy passed away

తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి క్రితంరోజు రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1948 మార్చి 8వ తేదీన నెల్లూరు జిల్లా (ప్రస్తుతం తిరుపతి జిల్లా) గూడూరులో ఆయన జన్మించారు. మైసూరు యూనివర్శిటీలో బీఈ పూర్తి చేశారు. అనంతరం కొంతకొలం సిమెంట్ రేకుల వ్యాపారాన్ని నిర్వహించారు. ఆ తర్వాత తన బంధువు ఎంఎస్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయన చిత్రసీమలోకి ప్రవేశించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఫటాఫట్ జయలక్ష్మి, శోభానాయుడులను 'అభిమానవంతులు' చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం చేసింది రామకృష్ణారెడ్డే. 1973లో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. 'వైకుంఠపాళి', 'గడుసుపిల్లోడు', 'సీతాపతి సంసారం', 'మావూరి దేవత', 'అల్లుడుగారు జిందాబాద్','అగ్ని కెరటాలు', 'మూడిళ్ల ముచ్చట' తదితర చిత్రాలనునిర్మించారు. 'అమ్మోరు తల్లి' చిత్రాన్ని డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh