Teaser Talk: Hero’s Journey With 3 Women 'థ్యాంక్యూ' టీజర్: లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు

Thank you teaser out naga chaitanya raashii khanna promise a slice of life drama

Thank You Teaser, Naga Chaitanya, Raashi Khanna, Malavika Nair, Avika Gor, Sai Sushanth Reddy, Prakash Raj, Thaman S, Vikram K Kumar, Dil Raju, Tollywood

The teaser of Naga Chaitanya's Thank You is now out. Thank You is a slice-of-life drama that revolves around Chaitanya's character. Thank You stars Naga Chaitanya, Raashii Khanna, Malavika Nair, Avika Gor, Prakash Raj, among others. Naga Chaitanya and Vikram K Kumar are collaborating for Thank You. The teaser of the film was unveiled a short while ago and it revolves around the central character, played by Naga Chaitanya.

'థ్యాంక్యూ' టీజర్: లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు

Posted: 05/25/2022 09:07 PM IST
Thank you teaser out naga chaitanya raashii khanna promise a slice of life drama

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ కథలో చైతూ జర్నీని చూపించారు. టీనేజ్ లోను .. ఆ తరువాత .. విదేశాలకి వెళ్లిన తరువాత ఆయనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ కథ నడవనున్నట్టు తెలుస్తోంది.

ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ తో ఆయన ప్రయాణం కొనసాగుతుందనే విషయాన్ని చూపించారు. ఆ జాబితాలో రాశి ఖన్నా .. అవికా .. మాళవిక నాయర్ కనిపిస్తున్నారు 'లైఫ్  లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను' అనే చైతూ డైలాగ్ ను బట్టి చూస్తే, సీరియస్ గా ఆయనకి ఏదో గోల్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. యాక్షన్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, జూలై 8వ తేదీన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thank You Teaser  Naga Chaitanya  Raashi Khanna  Prakash Raj  Thaman S  Vikram K Kumar  Dil Raju  Tollywood  

Other Articles