Anil Ravipudi big update on comedy sequel.. ఫన్ ఫస్ట్రేషన్ కంటిన్యూస్: 'ఎఫ్ 4'పై అనిల్ రావిపూడి అప్ డేట్

Anil ravipudi big update on comedy sequel third hero entry in f4

Fun and Frustration, Comedy sequel continues, Third Hero, F3 movie, venkatesh daggubati, varun tej, tamannah bhatia, mehreen, Devi sri prasad, Anil Ravipudi, Tollywood, Telugu Movies, Entertainment

Anil Ravipudi has attained the status of a minimum guarantee director with not even a single flop in his career so far. The third hero idea came when I thought about F3 after F2 was finished. So that’s the Trump card. If it is used now, there will be nothing to use again. That’s why we put that idea for F4.

ఫన్ ఫస్ట్రేషన్ కంటిన్యూస్: 'ఎఫ్ 4'పై అప్ డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి

Posted: 05/26/2022 04:31 PM IST
Anil ravipudi big update on comedy sequel third hero entry in f4

చిత్రరంగంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివచ్చి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి సినిమాలు.. అనుకున్నది అనుకున్నట్టుగా రూపోందించి సత్తాను చాటుకున్నారు. ఈ క్రమంలో కామెడీ సీక్వెల్ చిత్రాను తెరకెక్కించేందుకు ఆయన తన ప్రాధాన్యతను చూపుతున్నారు. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మాత్రమే సాధ్యమైన సీక్వెల్ చిత్రాలను ఇప్పుడు అనీల్ రావిపూడి మన తెలుగు తెరకు కూడా తీసుకువచ్చారు. ఎఫ్ 2 చిత్రంతో ప్రక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇక దానికి సీక్వెల్ ఎఫ్3 చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్నారు. ఈ నెల 27 ఈ చిత్రం విడుదల కానుంది.

ఎప్ 2 చిత్రాలనే కాదు ఆయన దర్శకత్వంలో రూపోందిన అన్ని చిత్రాలను పరిశీలిస్తే ఆయనకి కామెడీపై మంచి పట్టు ఉందనే విషయం వెంటనే అర్థమైపోతుంది. 'ఎఫ్ 2' సీక్వెల్ గా ఆయన చేసిన 'ఎఫ్ 3' పూర్తిస్థాయి కామెడీ ఇతివృత్తంగా కొనసాగుతుంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. 'ఎఫ్ 2' ను మించి కామెడీ ఉండాలనే ఉద్దేశంతోనే  'ఎఫ్ 3'లో వెంకటేశ్ కి 'రేచీకటి' .. వరుణ్ తేజ్ కి 'నత్తి' పెట్టడం జరిగింది.

చీకటిపడగానే తెరపై వెంకటేశ్ చేసే హడావిడి చూసితీరవలసిందే. ఇక వరుణ్ తన మేనరిజం సినిమా మొత్తంలో 30 చోట్ల వాడవలసి వచ్చింది. నాకు తెలిసి ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు .. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా బోర్ అనిపించదు. 'ఎఫ్ 3'లో మూడో హీరోను పెడదామని అనుకున్నాను. కానీ ఆల్రెడీ ఇందులో కావలసినంత ఫన్ వచ్చేసింది కనుక ఆ పాత్రను పక్కన పెట్టాం. 'ఎఫ్ 4'లో మాత్రం కచ్చితంగా మూడో హీరోను రంగంలోకి దింపడం జరుగుతుంది" అని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles