Virata Parvam Film Unit Special Video on Sai Pallavi విరాటపర్వం చిత్రబృందం నుంచి సాయిపల్లవికి స్పెషల్ వీడియో.!

Virata parvam film unit special video on sai pallavi birthday

HBD Vennala, HBD Sai Pallavi, Soul of Vennela, Virata Parvam, RanaDaggubati, SaiPallavi, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra, Venu Udugula, Suresh Bobbili, Sudhakar Cherukuri, Tollywood, Movies news, Entertainment

Virata Parvam, finally gets its release date on July 1. The film written and directed by Venu Udugula staring Rana Daggubati and Sai Pallavi in the action drama produced by Sudhakar Cherukuri under Sri Lakshmi Venkateswara Cinemas in association with Suresh Productions. On the occassion of actress Sai Pallavi's birthday, the makers of Virata Parvam have released a special sneakpeek into her character titled 'Soul of Vennela'. The character promo of Vennela takes us through her formative years, the time she has spent with her father, another character played by Easwari Rao, while also showcasing a series of images reflecting her never-say-die spirit.

విరాటపర్వం చిత్రబృందం నుంచి సాయిపల్లవికి స్పెషల్ వీడియో.!

Posted: 05/09/2022 07:48 PM IST
Virata parvam film unit special video on sai pallavi birthday

టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్‌తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో, తెలంగాణా యాసలో డైలాగులు పలికి.. తెలుగు వెండి తెరపై సింగిల్ ఫీస్ గా నిలిచింది. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే సాయి పల్లవి... నటనలో తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇవాళ సాయి పల్లవి పుట్టినరోజును పురస్కరించుకుని.. విడుదలకు సిద్దంగా వున్న అమె నటించిన విరాటపర్వం చిత్రబృందం అమెకు స్పెషల్ వీడియోతో శుభాకాంక్షలు చెప్పింది. సోల్ ఆఫ్ వెన్నెల పేరుతో... విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వెన్నల రెండు సార్లు పుట్టింది. తొలి పొద్దులో ఇప్పపూలు పూసినట్లు.. అడవిలో ఒకసారి. ఆశయాన్ని ఆయుధం చేసినట్లు అతని ప్రేమలో మరోసారి, అంటూ.. సాగే ఈ వీడియో ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది. ఈ వీడియోలో సాయి పల్లవి మరింత నేచురల్‌గా కనిపించింది. నిర్బంధాలు కౌగిలించుకున్న వసంతకాలం మనదే.. రేపు మనం ఉన్నా లేకున్నాచరిత్ర ఉంటుంది. మన ప్రేమకందరికీ వినిపిస్తోంది’ అన్న డైలాగ్స్ తో ఈ సోల్ ఆఫ్ వెన్నెల వీడియో ముగుస్తుంది. ఇక ఈ వీడియో చూసిన సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  వీడియో  అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియో చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles