టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు ప్రేక్షకులను అలరించిన తరువాత మళ్లీ ఇన్నాళ్లకు అదే ఓరవడి కొనసాగుతోంది. అయితే మనీ మనీ చిత్రం అనుకున్నంతగా పెద్దగా ప్రేక్షకాధరణ పోందలేదు. కానీ ఎఫ్ 3 మాత్రం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ రేంజ్ లో హిట్ అవవుతోందన్న అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనీల్ రావిపూడి దర్శకత్వంపై ఉన్న నమ్మకమే కారణం.
మొదటి భాగం ఎప్-2 కంటే సీక్వెల్ మరింత భారీ విజయం సాధిస్తుందని ‘ఎఫ్-3’ బృందం గట్టి నమ్మకంతో ఉంది. సంక్రాంతి కానుకగా 2019లో వచ్చిన ‘ఎఫ్-2’ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. మూడేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించగా వారి సరసన తమన్నా, మెహ్రీన్ మళ్లీ జత కడుతున్నారు. ఇప్పటికే చిత్ర నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఏదో ఒక అప్‌డేట్‌తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా మేకర్స్ చిత్రం నుంచి నటి పూజాహెగ్డే నటించిన స్పెషల్ సాంగ్ ప్రోమోను వదిలారు.
‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ సాగే ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. పూజాహెగ్డే నర్తించిన ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియో మే 17న విడుదల కానుంది. ఈ ప్రోమోలో వెంకటేష్, వరుణ్, పూజా వేసిన చిందులు అలరిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, రాహుల్ సిప్లీగంజ్, గీతా మాధురి ఆలపించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. వెంకీ, వరుణ్‌లకు జోడీగా తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించారు. సునీల్, సోనాల్ చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. సునీల్, సోనాల్ చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more