vishwak sen appeals media not to spoil his movie business తన చిత్రంపై మీడియా మిత్రులకు విశ్వక్ సేన్ అప్పీల్..

Vishwak sen appeals media not to spoil his movie business releases insta video

Ashoka Vanamlo Arjuna Kalyanam, OTT, AHA, Vishwak Sen, Rukshar Dhillion, Ritika Nayak, Jay Krish, ravi kiran Kola, Vidya Sagar Chinta, Bapineedu B, Sudheer Edara, Tollywood

Tollywood Young Hero Vishwak Sen made serious appeal to all the media and social media persons on his latest outing 'Ashoka Vanamlo Arjuna Kalyanam' movie. He said his movie is doing good business, don't spoil the silver screen viewers on the baseless stories of ott release.

తన చిత్రంపై మీడియా మిత్రులకు విశ్వక్ సేన్ అప్పీల్..

Posted: 05/09/2022 06:59 PM IST
Vishwak sen appeals media not to spoil his movie business releases insta video

టాలీవుడ్‌ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని ఎంచుకున్నాడు. ఈ నెల 6న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. విద్యాసాగర్‌ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ నిర్మించారు. జై క్రిష్ సంగీతం సమకూర్చగా, రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్‌గా నటించింది.

కాగా ఆయన నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా త్వరలో ఓటీటీలోకి వస్తుందని.. మీడియాలో కథనాలు రావడంతో హీరో విశ్వక్ సేన్ స్పందించాడు. ప్రస్తుతం తమ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. దీంతో విశ్వక్ సేన్ అభిమానులకు ఓ వీడియోను వదిలారు. తమ చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోని రిలీజ్‌ చేశారు. తన చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. సినిమాలు తీయడానికి తనకు హోప్ ఇచ్చారని అన్నారు. ఇక తమ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది.. మేం అనౌన్స్ చేస్తాం. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను ప్రకటనలతో చెడగొట్టకండని కోరారు.

మేమే ఇంకా ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేము ఫిక్స్‌ అయిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తాం. ప్రస్తుతానికి సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. కాబట్టి సోషల్‌మీడియాలో ఓటీటీ రిలీజ్‌పై పోస్టులు పెట్టే వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. థియేటర్‌లో సినిమా చూస్తే వచ్చే అనుభవం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని మిస్‌ కాకండి. మీరు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే థియేటర్‌లో సినిమా చూడాలనుకునేవారు కూడా ఓటీటీ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు సినిమాహాళ్లకు రారు. కాబట్టి, మీరు పెట్టిన పోస్టుల్ని దయచేసి డిలీట్‌ చేసేయండి. రూమర్స్‌ వ్యాప్తి చేయకండి’’ అని విశ్వక్‌ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles