టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ, అలా తెరకెక్కిన సీక్వెల్ సినిమాలు కామెడీ జోనర్లో మాత్రం చాలా తక్కువే ఉన్నాయి. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన మనీ చిత్రం తరువాత మనీ మనీ.. ఆ తరువాత మనీ మనీ మోర్ మనీ ఇలా సీక్వెల్ వచ్చినా.. అవి పరాజయాలనే మూటగట్టుకున్నాయి. అయితే తాజాగా కామెడీ చిత్రాలను రూపోందించడంలో తనదైన మార్కును వేసుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి మాత్రం తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎఫ్-3 మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
మొదటి భాగం ఎప్-2 కంటే సీక్వెల్ మరింత భారీ విజయం సాధిస్తుందని ‘ఎఫ్-3’ బృందం గట్టి నమ్మకంతో ఉంది. సంక్రాంతి కానుకగా 2019లో వచ్చిన ‘ఎఫ్-2’ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. మూడేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు.. కానీ ఆరో భూతం ఒకటుంది అదే డబ్బు.. డబ్బున్న వాడికి ఫన్, లేని వాడికి ఫ్రస్టెషన్ అంటూ’ మురళి శర్మ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.’ఏ ఏ ఏయ్ ఎంటీది ఇలా ఉంది అంటూ’ వెంకీ భోజనాన్ని తింటూ అంటుంటాడు. ‘మనీ ప్లాంట్ బిర్యానీ, మనీ ప్లాంట్ చారు, మనీ ప్లాంట్ వేపుడు’ అంటూ తులసి చెప్తుంది. ‘ఏంటీ ఫుడ్ కూడా మనీ ప్లాంట్స్తోనేనా’ అంటూ వెంకటేష్ ఆశ్చర్యంతో అంటాడు. ‘మన ఆశలే మన విలువలు’ .’పాతిక లక్షలు..దీన్ తల్లి తెల్లారే సరికి యైభై అయిపోవాలి’ అంటూ వచ్చిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
’ఇయ్ ఇలాంటి ఔలా గాల్లందరికి పైసలియ్.. అరే సొంత కొడక్కు పైసల్ ఇయ్యడానికి మనస్సు రాదు’ అంటూ దేవుడితో వరుణ్‌తేజ్ మొర పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ‘అదో పెద్ద మాయల మరాఠి ఫ్యామిలీ.. వాళ్ళది మరాఠి ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ ఐ వోంట్ లీవ్ అమ్మా’.. ‘నా మాట విను వాళ్ళది పెద్ద దగా ఫ్యామిలీ.. వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ’. అంటూ వచ్చిన డైలాగ్స్ సూపర్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి.ట్రైలర్ చివర్లో ‘ఉన్నదెంతా.. ఎంతుంటే అంతా.. మీరేం మాట్లాడరేంటడి అంతేగా అంతేగా.. వీడికి సీక్వెల్లో కూడా సేమ్ డైలాగా.. అంతేగా అంతేగా’ అంటూ వచ్చిన సంభాషణలు ఎఫ్2 చిత్రాన్ని గుర్తు చేశాయి.
ఇక ఓవరాల్‌గా ట్రైలర్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఉంది. ఈ సారి డబుల్ ఎంటర్టైనమెంట్ పక్కా అని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. కాగా, ఈ సీక్వెల్లో డబ్బు, బంగారం అని ఆశపడే వారి భార్యల వల్ల హీరోలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో తెలియజేసేలా ఎఫ్-3 సినిమా ఉంటుందని అర్థమవుతుంది. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే వెంకటేష్‌కు రేచికటీ, వరుణ్ తేజ్‌కు నత్తి ఉండనున్నట్లు తెలుస్తుంది. సునీల్, సోనాల్ చౌహన్లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
(And get your daily news straight to your inbox)
May 26 | చిత్రరంగంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివచ్చి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి సినిమాలు.. అనుకున్నది అనుకున్నట్టుగా రూపోందించి సత్తాను చాటుకున్నారు. ఈ క్రమంలో కామెడీ సీక్వెల్ చిత్రాను తెరకెక్కించేందుకు ఆయన తన ప్రాధాన్యతను చూపుతున్నారు.... Read more
May 26 | తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి క్రితంరోజు రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1948 మార్చి... Read more
May 25 | నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన... Read more
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more