Tollywood senior producer kodali bosu babu passed away టాలీవుడ్ లో మరో విషాదం.. సినీనిర్మాత బోసుబాబు ఇకలేరు..

Tollywood senior producer kodali bosu babu passed away

Kodali Bosu Babu, Film producer, Akkineni Nageshwara Rao, Krishna, Shoban babu, Police Venkataswamy, Kodali Bosu Babu movies, Kodali Bosu Babu biography, Kodali Bosu Babu passes away, Kodali Bosu Babu no more, Dasari Narayanarao, Dasari Padma, passed away, heart attack, Movie News, Entertainment, Tollywood

Another tragedy has occurred in Tollywood industry. Kodali Bosubabu, a senior producer in the Telugu film industry, has passed away due to a heart attack in Hyderabad. He is 66 years old. He has produced several hit films with previous generation heroes. He is a distant relative of the late Dasari Narayana Rao. Entering the film industry at an early age, he soon became a producer with unwavering dedication, discipline and perseverance.

టాలీవుడ్ లో మరో విషాదం.. సినీనిర్మాత బోసుబాబు ఇకలేరు..

Posted: 05/09/2022 04:41 PM IST
Tollywood senior producer kodali bosu babu passed away

టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి చెందారు. గుండెపోటుతో హైదరాబాదులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. మొన్నటి తరం హీరోలతో ఆయన పలు హిట్ చిత్రాలను నిర్మించారు. దివంగత దాసరి నారాయణరావుకు ఆయన దూరపు బంధువు అవుతారు. దాసరి భార్య దివంగత పద్మకు బోసుబాబు సోదరుడి వరుస అవుతారు. సినీ రంగంలోకి చిన్నస్థాయిలోనే అడుగుపెట్టిన ఆయన అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, పట్టుదలతో అనతికాలంలోనే నిర్మాతగా ఎదిగారు.

టాలీవుడ్ లోకి ఆయన ప్రవేశం సినీ నిర్మాణ వ్యవహారాలతో ప్రారంభమైంది. దాసరి సినిమాలకు ఆయన ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు. ఆ తర్వాత దాసరి ఆశీస్సులతోనే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ.. నిర్మాతగా మారారు. అక్కినేని నాగేశ్వరరావుతో 'రాగదీపం', నాగేశ్వరరావు కృష్ణలతో కలసి అప్పట్లోనే మల్టీస్టారర్ చిత్రం'ఊరంతా సంక్రాంతి', కృష్ణతో 'ప్రజాప్రతినిధి', శోభన్ బాబుతో 'జీవనరాగం', దాసరి నారాయణరావుతో 'పోలీస్ వెంకటస్వామి' సినిమాలను నిర్మించారు. బోసుబాబుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. బోసుబాబు (66) ఇక లేరనే విషయం తెలుసుకుని సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles