On Mother’s Day, Priyanka Chopra shares first photo with baby మధర్స్ డే: కూతురి ఫోటో రిలీజ్ చేసిన ప్రియాంకా చోప్రా..

Actress priyanka chopra s post on daughter s 100 days in hospital

Priyanka Chopra, Priyanka Chopra emotional post on mothers day, Priyanka Chopra emotional post on daughter, Priyanka Chopra Nick Jonas, Priyanka Chopra baby daughter, Priyanka Chopra baby Malti Marie Chopra Jonas, Priyanka Chopra Nick Jonas baby, Priyanka Chopra baby, Malti Marie Chopra Jonas, Bollywood, Movies News, Entertainment

Actor Priyanka Chopra shared the first picture of her baby daughter with the world on Mother’s Day, announcing that the infant was finally home after spending over 100 days in intensive care. Priyanka Chopra and her husband, singer Nick Jonas, had welcomed their daughter Malti Marie Chopra Jonas via surrogacy in January.

మధర్స్ డే: కూతురి ఫోటో రిలీజ్ చేసిన ప్రియాంకా చోప్రా..

Posted: 05/09/2022 03:48 PM IST
Actress priyanka chopra s post on daughter s 100 days in hospital

బాలీవుడ్ న‌టి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో ఉంచిన వైద్యులు.. ఇటీవల డిస్చార్జి చేసి.. ప్రియాంక, నిక్ జోన్స్ లకు అప్పగించారు. దీంతో తన ఆనందానికి అవధులు లేని ప్రియాంక  త‌న కూతురు మాల్తీ మేరి ఫోటోను తొలిసారి రిలీజ్ చేసింది. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా త‌న భ‌ర్త నిక్ జోన్స్‌తో క‌లిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేసింది.

ఆ ఫోటోలో ప్రియాంకా త‌న చేతుల్లో మాల్తీని ఎత్తుకుని ఉంది. ఫోటోతో పాటు ఓ భారీ సందేశాన్ని కూడా రాసిందామె. ఎట్ట‌కేల‌కు నా చిన్నారి ఇంటికి వ‌చ్చిదంటూ ప్రియాంకా త‌న ఉత్సాహాన్ని చాటుకున్న‌ది. స‌రోగ‌సీ ద్వారా ప్రియాంకా కుమార్తెకు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే గ‌డిచిన వంద రోజుల నుంచి ఆ శిశువు నియోనాట‌ల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంది. ప్ర‌తి ఒక్క‌రికీ ఫ్యామిలీ జ‌ర్నీ ప్ర‌త్యేకంగా ఉంటుందని అమె పేర్కోంది. ఒక స్థిర‌మైన న‌మ్మ‌కం కావాల‌ని, ఆ నమ్మకమే మనల్ని విజయం వైపు నడిపిస్తుంది అని అన్నారు.

గ‌త కొన్ని నెల‌లు తాము కొన్ని స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నామ‌ని, కానీ ప్ర‌తి క్ష‌ణం ఎంత విలువైందో అప్పుడే తెలుస్తుంద‌ని ఆమె త‌న పోస్టులో రాశారు. బిడ్డ చేతిలోకి రాగానే తల్లిగా మారిన ప్రియాంకకు.. తన తల్లిదండ్రులు కూడా గుర్తుకువచ్చారు. మ‌మ్మీ డాడీ ల‌వ్ యూ అంటూ ప్రియాంకా త‌న పోస్టులో సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. త‌న కూతురు క్షేమం కోసం నిరంత‌రం శ్ర‌మించిన డాక్ట‌ర్లు, హాస్పిట‌ల్ న‌ర్సుల‌కు ఆమె థ్యాంక్స్ చెప్పింది. లాస్ ఏంజిల్స్‌లోని రాడీ చిల్డ్ర‌న్స్ లా జోలా అండ్ సిడార్ సినాయ్ ఆస్ప‌త్రిలో మాల్తీ చికిత్స పొందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles