టీవీ లైవ్లో అప్పుడప్పుడూ విచిత్రాలు జరుగుతూ వుంటాయి. లైవ్లోనే రాజకీయ నాయకులు కొట్టుకున్న ఘటనలు గతంలో మనకు కన్పించాయి, విన్పించాయి. తాజాగా టీవీ9 యాంకర్ లైవ్ ఇంటర్వ్యూలో ఒక హీరోని గెట్ అవుట్ అని స్టూడియో నుంచి బయటకు గెంటేసిన ఘటన సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నది. అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్ సేన్ నిన్న ఫ్రాంక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంక్ వీడియో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రాంక్ వీడియోపై సోమవారంనాడు టీవీ9లో డిబేట్ జరిగింది.
ఫ్రాంక్ వీడియోకు సంబంధించిన కార్యక్రమం బయట జరుగుతుండగానే టీవీ9 స్టూడియోకు వచ్చిన హీరో విశ్వక్సేన్ యాంకర్ దేవి నాగవల్లితో డిబేట్లో పాల్గొన్నాడు. డిబేట్ సందర్భంలోనే విశ్వక్సేన్ ‘డిప్రెస్డ్ పర్సన్’ అని దేవి అన్నారు. దీంతో విశ్వక్సేన్కు కోపమొచ్చింది. వెంటనే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని ఆమెపై నిప్పులు చెరిగాడు. అయితే.. దీనిపై దేవీ నాగవల్లి వెంటనే సీరియస్గా స్పందించి, గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ బయటకు పంపించి వేశారు. ఇక నేను స్టూడియో నుంచి బయటకు వెళ్లగానే వారికి ఇష్టమెచ్చింది చెబుతారు అంటూ అసహనం వ్యక్తం చేసిన విశ్వక్ సేన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Vishwak Sen on . Tv9pic.twitter.com/q5oUdPc7Rh
— Sai Mohan (NTR ️) (@Sai_Mohan_999) May 2, 2022
(And get your daily news straight to your inbox)
May 27 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ను అనుకుంటున్నారన్న ఊహాగానాలు చిత్రపురిలో వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో తెలుగులో నేరుగా చిత్రాన్ని రూపొందిస్తున్న శంకర్... Read more
May 27 | ప్రయోగాత్మక కథలను.. నటనకు అస్కారమున్న పాత్రలను అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ వున్న చిత్రాలను ఎంచుకోవడంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. చిత్రం ఎలాంటిదైనా ఆయాపాత్రలలో పరకాయ ప్రవేశం చేసిరా అన్నట్లుగా... Read more
May 26 | చిత్రరంగంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివచ్చి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి సినిమాలు.. అనుకున్నది అనుకున్నట్టుగా రూపోందించి సత్తాను చాటుకున్నారు. ఈ క్రమంలో కామెడీ సీక్వెల్ చిత్రాను తెరకెక్కించేందుకు ఆయన తన ప్రాధాన్యతను చూపుతున్నారు.... Read more
May 26 | తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి క్రితంరోజు రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1948 మార్చి... Read more
May 25 | నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన... Read more