ఎస్ఎస్ రాజమౌళి రూపోందించిన చిత్రం అంటే వారాలు, నెలలు దాటి ఆడుతుందన్నడంలో సందేహమే లేదు. ఓటిటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చినా.. ఆయన చిత్రాలకు మాత్రం డిమాండ్ తగ్గదు. ఎల్లలు దాటి, సముద్రాలు దాటి ఆయన చిత్రాలు హిట్ అవుతాయి. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కూడా తన హవాను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇటీవలే విడుదలైన ‘ఆచార్య’, ఆర్ఆర్ఆర్‌కు ఎలాంటి పోటీనివ్వలేదు. సినిమా విడుదలై నెల రోజులు దాటినా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి.
ఈ చిత్రం ఆదివారం కూడా దాదాపు కోటీ వరకు కలెక్షన్లను రాబట్టింది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజమౌళి టేకింగ్‌కు సినీప్రముఖులు సైతం ఫిదా అయిపోయారు. చెర్రీ, తారక్‌ల నటన వర్ణనాతీతం. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోగా, అల్లూరీ సీతారామరాజు పాత్రలో చరణ్ జీవించేశాడు. ‘తుఫాన్’ సినిమాకు బాలీవుడ్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చరణ్.. ఈ చిత్రంలో తన నటనతో వాళ్ళనే పొగిడేలా చేశాడు. అల్లూరీ సీతారామరాజు ఇలానే ఉంటాడా అనేంతలా చరణ్ ఆ గెటప్‌లో అదరగొట్టేశాడు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక ప్రముఖ నేపాల్ పేపర్ ఫ్రంట్ పేజ్‌లో చరణ్‌కు చెందిన పోస్టర్‌ను వేయడం ఆసక్తిగా మారింది. మ్యాటరేంటో తెలియదు కానీ చరణ్ పోస్టర్ వేయడంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియాలో 1000కోట్ల మార్కును అధిగమించిన మూడో చిత్రంగా నిలిచింది. ఆలీయాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు.
(And get your daily news straight to your inbox)
May 27 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ను అనుకుంటున్నారన్న ఊహాగానాలు చిత్రపురిలో వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో తెలుగులో నేరుగా చిత్రాన్ని రూపొందిస్తున్న శంకర్... Read more
May 27 | ప్రయోగాత్మక కథలను.. నటనకు అస్కారమున్న పాత్రలను అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ వున్న చిత్రాలను ఎంచుకోవడంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. చిత్రం ఎలాంటిదైనా ఆయాపాత్రలలో పరకాయ ప్రవేశం చేసిరా అన్నట్లుగా... Read more
May 26 | చిత్రరంగంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివచ్చి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి సినిమాలు.. అనుకున్నది అనుకున్నట్టుగా రూపోందించి సత్తాను చాటుకున్నారు. ఈ క్రమంలో కామెడీ సీక్వెల్ చిత్రాను తెరకెక్కించేందుకు ఆయన తన ప్రాధాన్యతను చూపుతున్నారు.... Read more
May 26 | తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి క్రితంరోజు రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1948 మార్చి... Read more
May 25 | నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన... Read more