సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీలో ఉండాల్సిన అన్ని హంగులతో రాబోతోంది సర్కారు వారి పాట. లవర్ బోయ్‌గా కనిపిస్తూనే కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులు, ఇరగదీసే ఫైట్లతో ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ మధ్యలో మహేష్ శ్రీకాకుళం యాసలో చెప్పిన డైలాగులు ఫన్నీగా ఉన్నాయి. కీర్తి సురేశ్ చాలా అందంగా కనిపిస్తోంది. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ అభిమానులకు కావాల్సిన యాక్షన్, కామెడీ, రొమాన్స్‌లను చేర్చినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. నా ప్రేమను దొంగలించగలవ్.. నా స్నేహాన్ని దొంగలించగలవ్.. కానీ నా డబ్బును మాత్రం దొంగలించలేవ్ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఇక నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు తరచూ కొట్టే డైలాగ్ ను మహేష్ నోటి వెంట అనిపించడం ట్రైలర్ కే హైలైట్. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ ఇప్పటికే హిట్ టాక్ ను సోంతం చేసుకున్నాయి. కళావతి, ఎవ్రీ పెన్నీ లాంటి సాంగ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంతోని ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేష్.. త్రివిక్రమ్ డైరక్షన్లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది కాకుండా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితోనూ ఓ చిత్రం చేయబోతున్నారు మహేశ్. ఈ సినిమా కోసం సూపర్‌స్టార్‌తో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more