'Chinni' Trailer: Keerthy Suresh shocks as a serial killer ‘చిన్ని’గా ప్రేక్షకుల ముందుకు కీర్తి సురేశ్.. ట్రైలర్ ఇదిగో..

Chinni trailer keerthy suresh shocks as a serial killer

chinni official trailer, chinni official teaser, chinni trailer, chinni Telugu trailer, chinni Keerthy Suresh, chinni amazon prime video, chinni teaser, new Telugu movie, latest Telugu movie 2022, telugu movie 2022, new south movie, chinni release date, chinni release date 2022, saani kaayidham movie, Keerthy Suresh, Selvaraghava, new, movie, best, latest Telugu movie, amazon original movie, amazon prime video, prime video, chinni telugu movie, chinni, sauna kaayidham, 2022

'Chinni' may sound like it is the story of a tender woman who considers violence and gore delicate topics. This Telugu-Tamil film, to be released on Amazon Prime on May 6, is about unapologetic serial killings. Starring Keerthy Suresh in the titular role and set in Andhra, the film has Selvaraghavan as the female protagonist's relative from her husband's side. The 'Mahanati' actress plays a small-time constable who takes to the path of violence. Selva is full of rage as he commits a series of murders.

‘చిన్ని’గా ప్రేక్షకుల ముందుకు కీర్తి సురేశ్.. ట్రైలర్ ఇదిగో..

Posted: 04/27/2022 07:05 PM IST
Chinni trailer keerthy suresh shocks as a serial killer

మహానటితో తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన కీర్తి సురేశ్.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే మహేశ్‌తో కలిసి సర్కారు వారి పాట చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో మరో చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా పేరే చిన్ని. ఇందులో కీర్తి సురేశ్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో సాని కాయిధం పేరుతో రిలీజ్ కానున్న ఈచిత్రాన్ని తెలుగులో చిన్ని పేరుతో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం.

ఇందులో కీర్తి డీ గ్లామరైజ్డ్ పాత్రలో రా లుక్‌లో కనిపించింది. గ్రామీణ యువతి పాత్రలో ఆకట్టుకుంది. ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషించారు. ఎన్ని మర్డర్‌లు చేశావని రంగయ్య అనే వ్యక్తిని పోలీసులు అడగడంతో చిత్ర ట్రైలర్ ప్రారంభమవుతుంది. కీర్తి సురేశ్, సెల్వరాఘవన్ తాము చేసిన హత్యల గురించి చేబుతూ ఉత్కంఠకు గురి చేస్తారు. ముఖ్యంగా కీర్తి తన నటనతోనే భయపెట్టింది. ఎంత మందిని చంపావని పోలీసు కీర్తి సురేశ్‌ను అడుగ్గా.. 25 అని చెబుతుంది.. అదేంటి 24 అనే ఇంతకుముందున్న వ్యక్తి చెప్పాడు అని అడుగ్గా.. ఆ 25వ హత్య నీదే అంటూ పోలీసుతో క్రూరంగా చెప్పే డైలాగ్ అదిరిపోయింది.

ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్‌గా పనిచేసిన చిన్ని ఎందుకు 24 హత్యలు చేసిందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. మే 6 నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఓ పక్క కీర్తి సురేశ్ మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాటలో నటించింది. ఇందులో ఫుల్ గ్లామర్‌తో కనువిందు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinni  Official Trailer  Keerthy Suresh  Selvaraghavan  Arun Matheswaran  Sam CS  Amazon Prime Video  

Other Articles

Today on Telugu Wishesh