మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. బాహుబలి సిరిసీ్ చిత్రాల తరువాత రాజమౌళి అంటే పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోవడంతో ఆయన నుంచి వచ్చిన తదుపరి చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా దేశం సరిహద్దులు దాటి మరీ సవ్వడి చేసి.. బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టింది. దీంతో ప్రభాస్ తరువాత రాంచరన్, తారక్ లు కూడా పాన్ ఇండియా స్టార్లుగానే వెలుతొందుతున్నారు. ఇక చిత్రం విజయోత్సవ వేడుకలలో రెండో బాగంపై కూడా ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ఈ సందర్భంగా చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ (రాజమౌళి తండ్రి) చిత్రానికి రెండో బాగం కూడా ఉంటుందని చెప్పారు. దీంతో రెండో బాగం ఎప్పుడు మొదలవుతుంది అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని తెల్లదొరసాని ఓ చిన్నారిని ఎత్తుకుపోవడంతో కథ మొదలవుతుంది. అందమైన గొంతుతో అందరినీ హత్తుకునేలా పాట పాడుతూ బ్రిటీష్ దొరసాని చేతికి డిజైన్ వేస్తుంటుంది మల్లి. ఆమె టాలెంట్‌కు మంత్రముగ్ధురాలైన ఆమె తిరిగి కోటకు వెళ్లేటప్పుడు మల్లిని అన్యాయంగా లాక్కుని పోవడంతో సినిమా ప్రారంభమవుతుంది.
ఈ సినిమాలో మల్లి పాడే కొమ్మా ఉయ్యాల.. కోన జంపాల.. పాట సూపర్ హిట్టయ్యింది. ఈ మల్లిని బ్రిటీష్ దొరల నుంచి విముక్తురాలిని చేసి తిరిగి తన తల్లి వద్దకు చేర్చే పనిలో బాగంగానే తారక్ (భీమ్) ఢిల్లీకి చేరుకుంటాడు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్ 'కొమ్మా ఉయ్యాల' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. ఇందులో మల్లిని ఎత్తుకుపోయే దగ్గర నుంచి ఆమె బందీ అయిన క్షణాలు, ఎన్టీఆర్ ఆమెను భుజానెక్కించుకుని తిరిగిన సందర్భాలను చూపించారు. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి అద్భుతంగా ఆలపించింది.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more