'Jayamma Panchayathi': Pawan Kalyan chips in! పవన్​ కల్యాణ్ చేతుల మీదగా 'జయమ్మ పంచాయితీ' ట్రైలర్

Suma kanakala starrer jayamma panchayathi to hit screens on may 6

Jayamma Panchayathi, Theatrical Trailer, Suma Kanakala, Powerstar, Pawan Kalyan, Vijay Kalivarapu, M.M.Keeravaani, Balaga Prakash, Tollywood, movies, Entertainment

'Jayamma Panchayathi', starring Suma Kanakala as the protagonist, will hit the screens soon. The threatrical trailer of the film is released by Power Star Pawan Kalyan. The 'Bheemla Nayak' actor has in the past been interviewed by Suma. Several actors, including the likes of Ram Charan, have already supported 'Jayamma Panchayathi'. It's now the turn of the 'Hari Hara Veera Mallu' actor.

పవన్​ కల్యాణ్ చేతుల మీదగా 'జయమ్మ పంచాయితీ' ట్రైలర్

Posted: 04/16/2022 06:07 PM IST
Suma kanakala starrer jayamma panchayathi to hit screens on may 6

యాంకర్ గా బుల్లితెరపై రాణించి తనకెు తానే సాటి అని దూసుకెళ్లిన సుమ కనకాల.. సినీరంగ ప్రవేశం చేసింది. ఇదివరకే పలు చిత్రాల్లో చిన్నాచితక పాత్రల్లో నటించిన ఆమె ఇప్పుడు అమే లీడ్ రోల్ ప్లే చేస్తు ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలసిందే. ఆ చిత్రమే 'జయమ్మ పంచాయితీ'. విజయ్‌ కలివారపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్​ను పవర్​స్టార్​ పవన్ ​కల్యాణ్​ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్​లో జయమ్మగా.. సుమ లుక్స్​, నటన, సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

'రా బావా.. మా ఊర్లో పంచాయితీ సూద్దువ్ గానీ.. ఏ ఊర్లో జరగని ఎరైటీ గొడవ ఒకటి జరుగుతోంది' అని చెప్పడంతో ఈ ప్రచార చిత్రం ప్రారంభమైంది. ఇద్దరు ఆడ పిల్లల తల్లి అయిన జయమ్మ.. అనారోగ్యంతో ఉన్న తన భర్తను కాపాడుకునేందుకు.. గ్రామ పంచాయతీ ముందు తన సమస్యను లేవనెత్తుతుంది. అయితే అప్పటికే ఏదో సమస్యను ఎదుర్కొంటున్న గ్రామం.. ఆమె సమస్యను పక్కనపెడుంది. ఈ క్రమంలోనే తన సమస్యను పరిష్కరించడానికి బలమైన నిర్ణయం తీసుకున్న జయమ్మ.. ఆ గ్రామంపై కూడా పోరాడేందుకు సిద్ధమవుతోంది.

అయితే ఆ పోరాటం గ్రామంపై ఎలాంటి ప్రభావం చూపింది? చివరకి జయమ్మ సమస్యకు పరిష్కారం దొరికిందా? అనేది తెలియాలంటే విలేజ్ డ్రామాగా తెరకెక్కిన 'జయమ్మ పంచాయతీ' సినిమా చూడాల్సిందే. దీంతో పాటే ఒక పూజారి, అతని ప్రేయసి మధ్య జరిగే ప్రేమకథ.. ఒక టీనేజ్ అబ్బాయి-అమ్మాయి మధ్య స్నేహం వంటివి కూడా ఈ ప్రచార చిత్రంలో చూపించారు. మొత్తంగా బలగ ప్రకాశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles