Traffic challan to Prabhas car! పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు షాకిచ్చిన పోలీసులు.!

Actor prabhas fined for motor vehicle act rules violation

Pan India star Prabhas, allu arjun, akkineni naga chaitanya, manchu manoj, kalyan Ram, NTR, Hyderabad city police, Traffic police, Jubilee Hills, Road no 36, Neerus Showroom, number plate, black film, Supreme Court, Hyderabad, Telangana, Crime

The Hyderabad police booked a case and imposed a fine on the car of actor Prabhas at Jubilee Hills for violation of MV Act rules on Saturday. According to the police, a car was stopped at Jubilee Hills Road No.36 for faulty number plate and black film. The sub inspector imposed a fine of Rs.1600 on the car. The actor was not present in the vehicle.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు.!

Posted: 04/16/2022 09:34 PM IST
Actor prabhas fined for motor vehicle act rules violation

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. గతకొంతకాలంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో కార్లపై నజర్ పెట్టిన పోలీసులు నోటీసులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లోని అయ్యప్ప సోసైటికి వెళ్లే రహధారిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా, హీరో ప్రభాస్ కు చెందిన కారు రాగానే సైబరాబాద్ పోలీసులు జరిమానా విధించారు. ఒకటి కాదు,రెండు కాదు ఏకంగా మూడు ఫైన్లు వేసి షాకిచ్చారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ హైలైట్ అయ్యింది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు దేశంలోని కార్లకు బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని మార్గదర్శకాలు వచ్చాయి. కేవలం వై క్యాటగిరి భద్రత కలిగిన వ్యక్తులు మినహాయించి మిగతావారెవ్వరూ బ్లాక్ ఫిల్మ్ ను అద్దాలకు అంటించరాదని న్యాయస్థానం అదేశాలు జారీ చేసిన విషయం తలిసిందే. ఈ అదేశాల నేపథ్యంలో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో కార్లపై నజర్ పెట్టారున. ఏదేని కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే వెంటనే జరిమానా వేయడంతో పాటు వాటిని తొలగిస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే సినీప్రముఖులు అల్లు అర్జున్, మంచు మనోజ్, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నాగచైతన్య సహా పలువురి కార్లకు జరిమానా విధించారు. ఇక తాజాగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో నీరుస్‌ కూడలి వద్ద బ్లాక్‌ ఫ్రేమ్‌తో వెళ్తున్న కారు పోలీసుల కంటపడింది. కారును ఆపి పరిశీలించగా ఆ కారు ప్రభాస్‌ది అని తేలింది. నంబర్‌ ప్లేట్‌ సరిగా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్‌, బ్లాక్‌ ఫ్రేమ్‌ ఉండటంతో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ. 1450 జరిమానా విధించారు. ఆ సమయంలో ప్రభాస్‌ కారులో లేరు. కాగా గతంలోనూ ఎన్టీఆర్‌, నాగ చైతన్య, మంచు మనోజ్‌ సహా పలువురు హీరోల కార్లకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో పోలీసులు చలానా విధించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles