Pawan Kalyan appreciates The Kashmir Files producer పవన్ తో 'ది కశ్మీర్ ఫైల్స్' నిర్మాత.. పక్కనే హరీశ్ శంకర్

Pawan kalyan appreciates the kashmir files producer abhishek agarwal

Power Star Pawan Kalyan, Pawan Kalyan appreciates Abhishek Agarwal, Pawan Kalyan appreciates The Kashmir Files Producer, Bollywood Producer Abhishek Agarwal meets Pawan Kalyan, Pawan Kalyan Abhishek Agarwal Harish Shankar, Pawan Kalyan Abhishek Agarwal, Pawan Kalyan Harish Shankar, Abhishek Agarwal Harish Shankar, Hari Hara Veera Mallu, Krish, Tollywood, movies, Entertainment

The much acclaimed film ‘The Kashmir Files’ has been making headlines for quite some time now. The movie which was released on March 11 is getting appreciation from both the audience and critics. Now, Powerstar Pawan Kalyan called on the producer Abhishek Agarwal to congratulate him for the super success.

పవన్ కల్యాణ్ తో 'ది కశ్మీర్ ఫైల్స్' నిర్మాత.. పక్కనే హరీశ్ శంకర్!

Posted: 04/09/2022 07:22 PM IST
Pawan kalyan appreciates the kashmir files producer abhishek agarwal

బాలీవుడ్ బాక్సాఫీసు రికార్డులను బద్దలుకొట్టిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్' అన్న విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్లో సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఏకంగా రూ.300 కోట్లను ఆర్జించిన చిత్రంగా నిలించింది. 1990లో జమ్మూకశ్మీర్ లో కశ్మీరీ పండిట్లను ఊచకోత కోసిన ఘటనలతో ఈ చిత్రాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించారు.

తాజాగా జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిశారు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం నిర్మాణం అనూహ్య విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు పవన్ కల్యాణ్ అభినందించారు. చిత్రం అద్భుతంగా తెరకెక్కించారని, నిర్మాణ విలువు ఉన్నతంగా వున్నాయని ప్రశంసించారు. కాగా అభిషేక్ అగర్వాల్ టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తో పాటుగా వచ్చి పవన్ కల్యాణ్ ను కలిసినట్లు సమాచారం. అయితే ఈ కలయిక వెనుక కారణం ఏమిటన్నది మాత్రం వెలుగులోకి రాలేదు.

బాలీవుడ్ లో పెద్ద హిట్టైన పింక్ చిత్రాన్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్రను టాలీవుడ్ లో రిమేక్ చేసి.. వకీల్ సాబ్ చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన పవన్ సూపర్ హిట్ ను అందుకున్న నేపథ్యంలో అభిషేక్ అగర్వాల్ కూడా పవన్ కల్యాణ్ తో చిత్రాన్ని నిర్మించే అలోచనలో వున్నారా.? అన్న వార్తలు కూడా చిత్రపురిలో జోరందుకున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు హరీశ్ శంకర్ రూపోందించనున్నారన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పవన్ తో సుదీర్ఘమైన సంభాషణ జరగడం ఆనందంగా ఉందని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles