Puri's role in Chiranjeevi's movie confirmed! డైరెక్టర్ పూరీ కల నేరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి..

Puri jagannadh to play a special role in chiranjeevi s godfather

Chiranjeevi, Puri Jagannadh, liger, liger movie, liger director, Puri Jagannadh godfather, chiranjeevi godfather, Puri Jagannadh chiranjeevi, godfather chiranjeevi, Salman Khan, Nayanthara, Satyadev Kancharana, Mohan Raja, S.. Thaman, Tollywood, Movies, Entertainment

Chiranjeevi's upcoming film, Godfather, is only getting bigger and better! After Salman Khan, Liger director Puri Jagannadh is the latest big name to join the cast in a special role in Godfather. Chiranjeevi, who plays the lead role in the film, welcomed Puri onboard with a heartfelt note.

డైరెక్టర్ పూరీకి అవకాశం కల్పించిన మెగాస్టార్ చిరంజీవి

Posted: 04/09/2022 06:17 PM IST
Puri jagannadh to play a special role in chiranjeevi s godfather

మెగాస్టార్‌ చిరంజీవితో కలసి సినిమా చేయాలన్న క‌ల ఇన్నాళ్ళ‌కు నెర‌వేరింది ఈ డేరింగ్ డాషింగ్ డైరెక్ట‌ర్ కు. ఆయనే పూరీ జ‌గ‌న్నాథ్. సినీపరిశ్రమకు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌న హీరో చిరంజీవితో సినిమా చేయాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నించినా ఇన్నాళ్లు నెరవేరలేదు. అయితే ఎట్ట‌కేల‌కు చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది పూరీకి. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా చెప్పాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్నే పూరి చేయనున్నారు. అదేంటి ఈ చిత్రానికి మోహన్ రాజా కదా డైరెక్టర్. మరి ఇద్దరు డైరెక్టర్లు ఏమిటని కన్ఫూజ్ అవుతున్నారా..

మీరు అనుకున్నట్లే ఈ చిత్రానికి మోహనరాజానే దర్శకుడు. అయితే డైనమిక్ డైరెక్టర్ పూరీకి ఈ చిత్రంలో ద‌ర్శ‌కుడిగా కాకుండా న‌టుడిగా చిరంజీవి అవకాశం ఇచ్చారు. చిరంజీవి ‘గాడ్‌ఫాద‌ర్’ సినిమా ఓ ప్రముఖ పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాధ్ న‌టిస్తున్నాడు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘లూసీఫ‌ర్‌’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రీమేక్‌ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే స‌ల్మాన్‌ఖాన్ షూటింగ్ పూర్త‌యింది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో పూరీ న‌టిస్తున్న‌ట్లు చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించాడు. పూరీ ఈ చిత్రంలో జ‌ర్న‌లిస్టు పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

‘నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే ‘గాడ్‌ ఫాదర్‌’లో స్పెషల్‌ రోల్‌లో ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాను’అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. అయితే పూరీ, చిరంజీవి రీ ఎంట్రీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రిపాడు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అది జ‌రుగ‌లేదు. చిరంజీవికి జోడీగా న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles