తమిళనాట సినీ కళాకారులపై అభిమానానికి హద్దులు ఉండవు. సనీహీరోల కోసం, హీరోయిన్ల కసం ఏకంగా అక్కడ ఆలయాలను కూడా కట్టేసేంత అభిమానం. అయితే ఈ మధ్య ఆ అభిమానం కాస్తా హద్దులు మీరుతోంది. అభిమానం హద్దుల్లో ఉండాలి కానీ.. హద్దుమీరి..శృతిమీరి హీరోల ఫ్యాన్ వార్ నడుస్తోంది. తమ అబిమాన హీరోను ఎవరైనా ఏమైనా అంటే.. అవతలి హీరోపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ట్రోల్స్ చేయవచ్చు.. ఎలాంటి చేయకూడదన్న విచక్షణను కూడా మర్చిపోయి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ అత్యంత దారుణమైన ట్రోల్స్.. కొలీవుడ్ లోని హీరోల పరస్పర సంబంధాలపై కూడా అగ్గిరాజేసేలా వున్నాయంటే అతిశయోక్తి కాదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అజిత్ అభిమానుల మధ్య ప్రస్తుతం మరోమారు ఫ్యాన్ వార్ జరుగుతోంది. నిజానికి ఈ ఇద్దరు హీరోలు పరస్పరం చాలా సన్నిహితంగా ఉంటారు. కానీ వారి అభిమానులు మాత్రం వారిని అలా ఉండనివ్వడం లేదు. మా హీరో ఎక్కువ అంటే మా హీరో ఎక్కువ అంటూ వీరిద్దరి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు.
ఇప్పటికే అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మధ్య చాలా సార్లు సోషల్ మీడియా వేదికగా గొడవలు జరిగాయి. తాజాగా మరోసారి విజయ్ ని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈసారి మరింత శృతిమించి విజయ్ ని టార్గెట్ చేశారు. విజయ్ చనిపోయాడని.. 'బీస్ట్' అతడి ఆఖరి సినిమా అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. రిప్ జోసెప్ విజయ్ (RIPJosephVijay) అనే హ్యాష్ ట్యాగ్ ని నేషనల్ లెవెల్ లో ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ ఫొటోలను ఇష్టమొచ్చినట్లుగా మార్ఫింగ్ చేసి ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్ లు చూసిన విజయ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
అయినా రివర్స్ ట్రోలింగ్ చేయకుండా నెగిటివిటీని పట్టించుకోకండి (Ignore Negativity) అనే ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అజిత్, విజయ్ కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. నెగెటివ్ ట్రోలింగ్ ఆపాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కొందరు అజిత్ ఫ్యాన్స్ స్వయంగా 'అజిత్ కి ఇలానే పనులు నచ్చవని.. మీరు నిజమైన అజిత్ ఫ్యాన్స్ అయితే ఈ ట్రోలింగ్ ఆపండి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ నెగెటివ్ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. RIPJosephVijay అనే హ్యాష్ ట్యాగ్ మీద ఇప్పటివరకు 35 వేలకు పైగా ట్వీట్స్ పడ్డాయి.
Time To Let Settle And Repaid Burn Retweet Button
— Sanjay (@Detail_AK3) March 26, 2022
Actor vijai Passed away#RIPJosephVijay #Valimai #AK61 #AK62 pic.twitter.com/nyyJCmTDIG
(And get your daily news straight to your inbox)
Jul 04 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా... Read more
Jul 04 | నందమూరి హీరో కల్యాణ్‌రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బింబిసార. మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం... Read more
Jul 04 | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త... Read more
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more