RRR box office collection Day 1 grosses Rs 250 crore ఆర్ఆర్ఆర్ కలక్షన్ల సునామీ: తొలిరోజే రికార్డుల బద్దలు..

Rrr box office collection day 1 ss rajamouli film grosses over rs 250 crore worldwide

rrr earning, rrr box office, rrr box office collection, rrr box office day 1, rrr collection, rrr total collection, rrr international collection, RRR 1st day collections, Jr NTR, Ram Charan, Alluri sitaramaraju, ss rajamouli, rrr release date, rrr March 25th 2022, alia bhatt, Rajamouli Ram charan, Rajamouli NTR, SS Rajamouli poster, Kumaram Bheem, Ajay devgn, Alia Bhatt, MM keeravani, Tollywood, Entertainment, movies

SS Rajamouli’s magnum opus RRR has received a unanimous thumbs up from the audience and film critics. Starring Jr NTR and Ram Charan in the lead roles, the film has already brought a ‘tsunami’ at the ticket windows. As per trade analyst Ramesh bala, RRR has grossed more than Rs 257 crore on the worldwide box office on opening day.

ఆర్ఆర్ఆర్ కలక్షన్ల సునామీ: తొలిరోజే రికార్డుల బద్దలు..

Posted: 03/26/2022 01:24 PM IST
Rrr box office collection day 1 ss rajamouli film grosses over rs 250 crore worldwide

ఆర్‌ఆర్‌ఆర్‌.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదలయ్యేవరకు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసేలా చేసిన చిత్రబృందం.. అభిమానులను నాలుగేళ్ల పాటు నిరీక్షింపజేసి.. మార్చి25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ ల‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ త‌దిత‌రులు న‌టించారు.

డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. ఇక అభిమానులు రెండో రోజున నెట్టింట్లో ఈ చిత్రం ఎంతమేర కలెక్షన్లను రాబట్టిందన్న విషయమై ఉదయం నుంచి ఆరా తీస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది? సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ వస్తాయనేది అందరూ ఊహించినదే.. అయితే తొలిరోజున ఎంత? ఎన్ని కోట్లు ఆర్జించిందన్న విషయం తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపించారు. భారీ తారాగణం, టెక్నికల్‌ వాల్యూస్‌తో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాస్తూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది.

రిలీజ్‌కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్లలో సునామి సృష్టించింది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఒక్క నైజాం ఏరియాలోనే క‌లెక్ష‌న్లప‌రంగా స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో తొలి రోజున రూ.23.35 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాస్తూ సరికొత్త రికార్డులను సృష్టించింది. తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో సుమారు 120.19కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అలాగేఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఓవర్సీస్‌ కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 257.15 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా పవర్‌ మరోసారి చూపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  Ram Charan  SS Rajamouli  Ajay devgn  Alia Bhatt  Oliva morris  MM keeravani  Dvv Danaiah  Tollywood  

Other Articles