Rana’s Virata Parvam to release in second half of 2022 ‘విరాట ప‌ర్వం’ విడుద‌ల‌పై క్లారిటీ.. విడుద‌ల ఎప్పుడంటే?

Is rana daggubati s virata parvam finally seeing the light of the day

‘Virata Parvam’, Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Venu Udugula, Needhi Naadhi Oka Kadha, Suresh Bobbili, COVID-19 pandemic, OTT platform, Sri Lakshmi Venkateswara Cinemas, Suresh Productions, Tollywood, Movies, Entertainment

There are no updates on ‘Virata Parvam’, which created a huge curiosity two years ago when the first look glimpses were unveiled. Due to the COVID-19 pandemic, the film got delayed. And people have almost forgotten about its existence. But now, there is a talk that the film is finally seeing the light of the day.

‘విరాట ప‌ర్వం’ విడుద‌ల‌పై క్లారిటీ.. విడుద‌ల ఎప్పుడంటే?

Posted: 03/26/2022 12:12 PM IST
Is rana daggubati s virata parvam finally seeing the light of the day

క‌రోనా లాక్ డౌన్ లో వాయిద ప‌డ్డ సినిమాల‌న్ని వ‌రుస పెట్టి విడుద‌ల‌ అవుతున్నాయి. గతేడాది పుష్ప‌, అఖండ‌, శ్యామ్ సింగ‌రాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్ర‌మంలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయ‌క్ సినిమాలు విడుద‌ల‌ై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో ప్ర‌తి వారం ఓ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేయ‌డానికి సిద్ద‌మ‌య్యాయి. కానీ ఒక్క సినిమా మాత్రం ఇంకా విడుద‌ల తేదీపై క్లారిటి ఇవ్వ‌టం లేదు. ఆ సినిమానే ‘విరాట ప‌ర్వం’.

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా నీదినాది ఒకేక‌థ ఫేం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం గ‌తేడాది ఏప్రిల్‌లో విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా కార‌ణంగా ఈ మూవీని అన్ని చిత్రాల‌తో పాటే వాయిదా వేశారు. మిగితా చిత్రాలు మాత్రం వ‌రుస‌గా విడుద‌ల‌వుతుంటే, విరాట ప‌ర్వం మాత్రం ఇంకా విడుద‌ల‌కు నోచుకోలేక‌పోతుంది. దీనికి ముఖ్య కార‌ణం స‌రేష్‌బాబు అంటూ ప్ర‌చారం సాగింది. సురేష్‌బాబు నారప్ప‌, దృశ్యం సినిమాల మాదిరిగానే విరాట ప‌ర్వం చిత్రాన్ని కూడా నేరుగా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న‌ట్లు గ‌తం నుంచి ప్ర‌చారం అవుతుంది.

అయితే  ఈ వార్త‌ల‌పై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టివ‌రకే చాలా వ‌ర‌కు సినిమాలు విడుద‌ల తేదిల‌ను ప్ర‌క‌టించాయి. దాంతో స‌రైన తేదీ చూసి ‘విరాట‌ప‌ర్వం’ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ఆలోచిస్తున్నార‌ట‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles