Actor Simbu's Car Runs Over Pavement Dweller స్టార్ హీరో కారు ఢీకొని వృద్ద వికలాంగుడు మృతి

Actor simbu s car mows down 70 year old man in teynampet

Simbu, Tamil Hero, Tamil actor Silambarasan, T Rajendran, T Nagar, Road Turning, old Handicapped man, simbu accident, simbu driver, simbu hit and run, simbu driver arrested Chennai, simbu accident, simbu driver, simbu hit and run, simbu driver arrested, simbu car accident, Tamil Nadu, Crime

A car registered to Tamil actor Silambarasan aka Simbu ran over a homeless man on Wednesday night, as per reports. The 70-year-old victim, who suffered injuries to head, hip, and legs, was rushed to the hospital, where he succumbed to the injuries. As per a report, police have arrested Simbu's driver in connection with the accident.

వృద్ద వికాలాంగుడి పాలిట మృత్యుశకటంలా స్టార్ హీరో కారు..

Posted: 03/24/2022 04:13 PM IST
Actor simbu s car mows down 70 year old man in teynampet

కొలీవుడ్ కు చెందిన స్టార్ హీరో కారు.. ఆ వికలాంగుడి పాలిట మృత్యుశకటంగా మారింది. రెండుకాళ్లు పనిచేయని ఓ వికలాంగ వృద్ధుడు రోడ్డు దాటేందుకు అవస్థలు పడుతుండగా, అతడ్ని గమనించని స్టార్ హీరో కారు ఢీకొనింది. దీంతో వృద్ద వికలాంగుడు అక్కడికక్కడే మరణించాడు. క్రితం రోజు రాత్రి చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోలీవుడ్ లో అగ్రహీరోగా రాణిస్తున్న శింబు కారు ఢీకోనడంతో వృద్ద వికలాండుగు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనకు సంబంధించి శింబు డ్రైవర్​ సెల్వంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటన చోటుచేసుకున్న సమయంలో స్టార్ హీరో శింబు గానీ అతడి కుటుంబసభ్యులు గానీ కారులో ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై వారు ఇంకా స్పందించలేదు. కాగా, ప్రమాదఘటన వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు పక్కనే పేవ్​మెంట్​పై నివసించే వృద్ద వికలాంగుడు మునుస్వామి.. నెమ్మదిగా రోడ్డు దాటుతున్నాడు.

అయితే వరుసగా వాహనాలు వస్తుండటంతో కాసింత సేపు అగి అటు ఇటు తన చేతుల సాయంతో కదులుతూ ముందుకు రాసాగాడు. సరిగ్గా మలువు వద్ద రోడ్డు మధ్యలోకి వచ్చిన వికలాంగుడిని టర్నింగ్​ తీసుకుంటున్న శింబు కారు ఢీకొట్టింది. వెంటనే కారు అక్కడి నుంచి అగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటన సీసీటీవీ కెమేరాకు చిక్కింది. అక్కడే ఉన్న స్థానికులు కారును వెంబడించడం అందులో కనబడుతోంది. ఆ తర్వాత మునుస్వామిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  Tamil Hero  T Rajendran  T Nagar  Road Turning  old Handicapped man  Chennai  Tamil Nadu  Crime  

Other Articles