Mahabharat’s Bheem Praveen Kumar dies of a heart attack మహాభారత్ భీముడి పాత్రధారి ప్రవీణ్ కుమార్ కన్నుమూత

Mahabharat s bheemaka praveen kumar sobti dies of massive cardiac arrest at 75

Parveen Kumar Sobti, Parveen Kumar Sobti dead, mahabharat bheem dead, Parveen Kumar Sobti death, praveen kumar sobti passes away, mahabharat actor pravin kumar sobti passes away, mahabharat bheem passes away, praveen kumar bhim, praveen kumar sobti age, mahabharat actor, TV Mahabharat, Bheem role, Border Security Force, BJP, AAP, Delhi, Bollywood

Actor Praveen Kumar Sobti, popular for essaying the role of Bheem in BR Chopra’s Mahabharat, has died at the age of 75. Kumar’s daughter Nikunika told indianexpress.com, “He passed away yesterday around 9.30 pm. He suffered a heart attack. He died at home in Delhi.”

మహాభారత్ భీముడి పాత్రధారి ప్రవీణ్ కుమార్ కన్నుమూత

Posted: 02/08/2022 11:45 AM IST
Mahabharat s bheemaka praveen kumar sobti dies of massive cardiac arrest at 75

బాలీవుడ్ పరిశ్రమలో విషాదం అలుముకుంది. ప్రముఖ టీవీనటుడు.. బీఆర్ చోప్రా రూపోందించిన మ‌హాభార‌త్ సీరియ‌ల్‌లో భీమ పాత్రధారి అయిన ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ క‌న్నుమూశారు. 74 ఏళ్ల ప్ర‌వీణ్ కుమార్‌ మ‌ర‌ణించిన‌ట్లు ఆయ‌న కుమార్తె నికునికా వెల్ల‌డించారు. సోమ‌వారం రాత్రి 9.30 నిమిషాల‌కు త‌న తండ్రి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆమె తెలిపారు. హార్ట్ ఎటాక్ రావ‌డంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని అశోక్ విహార్ లోని తన ఇంట్లోనే ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు. క్రితంరోజు రాత్రి ఆయనకు ఛాతిలో నొప్పిరావడంతో కుటుంబసభ్యులు వెంటనే వైద్యుడిని సంప్రదించారు.

ఆయన వచ్చి ఆసుపత్రికి తరలించేలోపే ప్రవీణ్ తుదిశ్వాస విడిచారు. టీవీ మ‌హాభార‌త్ సిరీయ‌ల్‌లో భీముడి పాత్ర‌తో ప్ర‌వీణ్ దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. ఇంకా అనేక బాలీవుడ్ సినిమాల్లోనూ ఆయన తన నటనతో మెప్పించారు. అమితాబ్ తీసిన షెహెన్‌షా, ధ‌ర్మేంద్ర తీసిన లోహ చిత్రాల్లోనూ ప్ర‌వీణ్ పాత్ర‌లు బాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆజ్ కా అర్జున్‌, అజూబా, ఘాయ‌ల్ లాంటి హిట్ చిత్రాల్లోనూ నటించిన ప్రవీణ్ కుమార్ తన విలక్షణ నటనతో చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

యాక్టింగ్ కెరీర్‌లోకి రావ‌డానికి ముందు ప్ర‌వీణ్‌.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో చేరారు. ఆయన తన అధ్లెటిక్ నైపుణ్యాలను గుర్తించిన అధికారులు ఆయనను క్రీడలలో ప్రోత్సహించారు. దీంతో ఆయన డిస్కస్‌ త్రో, హ్యామర్‌ వంటి ఆటల్లో ఎన్నో అథ్లెటిక్‌ పోటీల్లో రాణించారు. నాలుగు సార్లు ఆసియా క్రీడ‌ల్లోనూ అత‌ను మెడ‌ల్స్ అందుకున్నాడు. 1968లో మెక్సికోలో, 1972లో మ్యూనిచ్‌లో జ‌రిగిన ఒలింపిక్స్‌లో భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ప్ర‌వీణ్‌కు అర్జున్ అవార్డు కూడా ద‌క్కింది. బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్‌లో అత‌ను డిప్యూటీ క‌మాండెంట్‌గా ప‌నిచేశాడు. 2013లో ఆమ్ ఆద్మీ టికెట్‌పై ఢిల్లీ అసెంబ్లీలో పోటీప‌డ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles