Ravi Teja Khiladi​ movie trailer launched ‘ఈ ఆటలో ఒక్కడే కింగ్’ అంటున్న ‘ఖిలాడీ’.. ట్రైలర్

Mass maharaja ravi teja khiladi movie trailer launched

Khiladi, Khiladi​ Movie Trailer, Raviteja, Meenakshi Chaudhary, Dimple Hayathi, Anasuya Bharadwaj, Ramesh Varma Penmetsa, Devi Sri Prasad, Tollywood, movies, Entertainment

Mass Maharaja actor Ravi Teja is all set to enthrall moviegoers with his upcoming film Khiladi that will release worldwide on February 11th.The film directed by Ramesh Varma and produced by Satyanarayana Koneru came up with theatrical trailer. Meenakshi Chaudhary, Dimple Hayathi are the female leads in the flick. Anasuya Bharadwaj also plays a supporting role. Devi Sri Prasad has composed the music.

‘ఈ ఆటలో ఒక్కడే కింగ్’ అంటున్న ‘ఖిలాడీ’.. ట్రైలర్

Posted: 02/07/2022 08:20 PM IST
Mass maharaja ravi teja khiladi movie trailer launched

మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఈ సినిమాకు దర్శకుడు రమేశ్ వర్మ రూపొందిస్తుండగా.. భారీ బడ్జెట్ తో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా.. రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సినీబృందం రవితేజ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది. ఇప్పటికే వదిలిన సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్  ను రిలీజ్ చేశారు. "ఎప్పుడూ ఒకే టీమ్ లో ఆడటానికి నేషనల్ ప్లేయర్ ను కాదు .. ఐపీఎల్ ప్లేయర్. ఎవడు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను" అనే రవితేజ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.

ఇది రవితేజ మార్క్ సినిమా అని చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ చాలు. కంటైనర్ లో కోట్ల రూపాయలు .. దానిని చేజిక్కించుకోవడానికి కొన్ని ముఠాలు రంగంలోకి దిగుతాయి. ఆ డబ్బు చుట్టూనే ఈ కథ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. 'పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు .. ఈ ఆటలో ఒక్కడే కింగ్ ఉంటాడు" అనే రవితేజ డైలాగ్ తో కథ ఏమిటనేది స్పష్టమవుతుంది. యాక్షన్ .. రొమాన్స్ .. కామెడీతో మాస్ సాంగ్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles