Tollywood biggies hail CM Jagan in resolving ticket issue టికెట్ ధరకు శుభంకార్డు.. చిరంజీవిపై సినీప్రముఖుల ప్రశంసలు

Mahesh babu prabhas ss rajamouli thank megastar for solving ap movie ticket price issue

Chiranjeevi, Mahesh Babu, Prabhas, SS Rajamouli, Koratala siva, R.Narayana murthy, YS Jagan Mohan Reddy, Andhra Pradesh Government, rrr, radhe shayam, andhra pradesh cinema ticket price, Andhra Pradesh, Tollywood, movies, Entertainment

Top actors such as Mahesh Babu, Prabhas, R.Narayana Murthy, directors SS Rajamouli and Koratala Siva were overjoyed by the positive outcome of the meeting with the CM. While they stopped short of revealing all the details, all of them were quite upbeat about the assurance given by the government. The stars also took the opportunity to thank Chiranjeevi for patiently carrying out negotiations with the CM’s office.

టికెట్ ధరలకు శుభంకార్డు.. చిరంజీవిపై సినీప్రముఖుల ప్రశంసలు

Posted: 02/10/2022 10:22 PM IST
Mahesh babu prabhas ss rajamouli thank megastar for solving ap movie ticket price issue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సినిమా టిక్కెట్ల వ్యవహరాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తో సినీపరిశ్రమకు చెందిన అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి, రెబెల్ స్టార్ ప్రభాస్; సూపర్ స్టార్ మహేశ్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, కమేడియన్ అలి, సోసాని కృష్ణమురళి సహా పలువురు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు భేటీ ఆయిన అనంతరరం తమకు సానుకూలంగా నిర్ణయం రాబోతుందని, తమ సమస్యలను సానుకూల దృక్ఫథంతో సీఎం జగన్ అర్థం చేసుకున్నారని ప్రముఖులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ తమను ఎంతో సంతోష పరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. టికెట్‌ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు.

చిన్న సినిమాల ఐదోషోకు అనుమతించడం శుభపరిణామమని చెప్పారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరంజీవి చెప్పారు. మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడిందని కొనియాడారు. హైదరాబాద్‌ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్‌ చెప్పారని చిరంజీవి తెలిపారు. దానికి తమ వంతు సహకారం ఉంటుందని చెప్పామన్నారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని.. సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలిపారు.

సినీ పరిశ్రమకు ఇవాళ చాలా శుభపరిణామమని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. ఏపీ సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్న మహేశ్‌... ఆరు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమ గందరగోళంగా ఉందన్నారు. ఏపీ సీఎం చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఐదారు నెలలుగా గందరగోళ పరిస్థితి ఉందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. అందరి ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు వస్తున్నాయన్న ఆయన... చిరంజీవి చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు.





తెలుగు రాష్ట్రాల్లో సినిమా మనుగడ క్లిష్టంగా మారిందని పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి అన్నారు. భారీ చిత్రాల విడుదలపుడు చిన్న సినిమాల పరిస్థితి కష్టంగా మారిందని పేర్కొన్నారు. చిన్న సినిమాలను కాపాడాలని ఏపీ సీఎంను కోరినట్లు చెప్పారు. చిన్న సినిమాల మనుగడకు చర్యలు చేపడతామన్నారు. సినీ పరిశ్రమ సమస్యలను ఏపీ సీఎం దృష్టికి చిరంజీవి తెచ్చారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. చిన్న సినిమాల మనుగడపై ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. నెలాఖరులోపు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles