Lab Dab Dabboo full song lyrical from F3 movie 'ఎఫ్ 3' నుంచి ‘లబ్ డబ్ డబ్బో’ లిరికల్ సాంగ్ రిలీజ్.!

Lab dab dabboo full song lyrical from f3 movie staring venkatesh varun tej

F3, Lab Dab Dabboo Lyrical, Victory Venkatesh, Mega Prince Varun Tej, Tamannaah, Mehreen Pirzada, Rajendra prasad, Sunil, Anil Ravipudi, DSP, Ram Miriyala, Bhaskarabhatla, Dil Raju, tollywood, movies, Entertainment

The F3 film, featuring Venkatesh Daggubati and Varun Tej and directed by Anil Ravipudi, is set to enter theatres on April 28, 2022. As a result, the producers have began to market the film and, as part of that, have announced the release of the film's first track.

'ఎఫ్ 3' నుంచి ‘లబ్ డబ్ డబ్బో’ లిరికల్ సాంగ్ రిలీజ్.!

Posted: 02/07/2022 07:25 PM IST
Lab dab dabboo full song lyrical from f3 movie staring venkatesh varun tej

విక్టరీ వెంకటేశ్ - మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా 'ఎఫ్ 3' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. వెంకటేశ్ సరసన నాయికగా తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కనువిందు చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ .. ఎవరు కనిపెట్టాడోగాని దీన్ని అబ్బో .. " అంటూ ఈ పాట సాగుతోంది. చేతిలోనే క్యాషే ఉంటే ఫేసు లోకి గ్లో వస్తుంది .. ఫ్లాషు బ్యాకు చెరిపేయొచ్చు అంటూ, పైస ఉంటేనే ఈ లోకంలో అనుకున్నవన్నీ నెరవేరతాయి .. లేదంటే పక్కకి జరుగుతాయి అనే అర్థంలో ఈ పాట నడుస్తుంది.

భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించగా .. భాను కొరియోగ్రఫీని అందించాడు. పాట అంతా కూడా కామెడీ ప్రధానంగానే సాగుతుంది. ఎఫ్-2లో హీరోలతో ముడివేసుకుని తిరిగిన రాజేంద్రప్రసాద్ మాత్రం ఈ పాటలో కనిపించలేదు. అయితే ఇక్కడ కమేడియన్ సునీల్ మాత్రం కనిపించడంతో ప్రేక్షకులకు నవ్వుల విందు గ్యారంటీ అని ఫిక్స్ అవుతున్నారు ప్రేక్షకులు. ఇక ఈ పాటలో చరణాలు నిజాన్ని చెబుతున్నా.. అవిపెద్దగా ప్రేక్షకులకు రుచించని విధంగా వున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. సంగీత కనిపించనున్నారు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : F3  Lab Dab Dabboo Lyrical  Venkatesh  Varun Tej  Tamannaah  Mehreen Pirzada  Anil Ravipudi  DSP  Dil Raju  tollywood  

Other Articles