Allu Arjun's 'Pushpa' collected Rs 30cr in Kollywood కాలీవుడ్ లో రికార్డులను తిరగరాస్తున్న అల్లుఅర్జున్ ‘పుష్ప’

Allu arjun s pushpa the rise collected rs 30cr in kollywood

Pushpa, Allu Arjun, Rashmika mandana, sukumar, DSP, Indravathi Chauhan, Pushpa The Rise, Pushpa Promotions, Pushpa Tamil, Pushpa allu arjun, Pushpa sukumar, Pushpa Rashmika, Pushpa Telugu movie, Allu Arjun movies, allu arjun galary, allu arjun photos, allu arjun songs, allu arjun cinemas, allu arjun updates, allu arjun upcoming movies, allu arjun breaking news, allu arjun breaking updates, allu arjun lineup of films, allu arjun upcoming projects, Tollywood, Movies, Entertainment

After winning hearts at the Box Office, Allu Arjun’s Pushpa: The Rise Part I is also created a good buz in kollywood. The movie is entertaining the audience on an OTT platform. The film is still doing good business in theatres, especially its Tamil version and created a record business at kollywood boxoffice.

కోలీవుడ్ లో రికార్డులను తిరగరాస్తున్న అల్లుఅర్జున్ ‘పుష్ప’

Posted: 01/28/2022 08:42 PM IST
Allu arjun s pushpa the rise collected rs 30cr in kollywood

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సూపర్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా దేశవ్యాప్తంగా పాన్ డమిక్ పరిస్థితులలోనూ రికార్డులు సృష్టించింది. కరోనా మహమ్మారి చిత్రసీమకు శాపంగా మారిన తరుణంలో అల్లు అర్జున్ కు మాత్రం అల వైకుంఠపురంలో తరువాత పుష్ప చిత్రాల రికార్డులను తిరిగరాసేలా చేసింది, గతేడాది డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా చిత్రంగా థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం.. తొలి రోజున నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఆ తరువాత మాత్రం బన్ని నటన, డీగ్లామరస్ రోల్ లో రష్మిక నటన.. మాస్ అడియన్స్ ను చాలా ఆకర్షించింది.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అలరించింది. ఎర్రచందనం అక్రమ రవాణా చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు అనిపించినా.. ఇంటి పేరు కోసం పుష్పరాజ్ పడే తపన కథలో అంతర్లీనంగా కొనసాగడం.. దాని కోసం ఆయన పడే తపన ప్రేక్షకులను అకట్టుకుంది. తనకు ఊహ తెలుస్తున్న వయస్సులో తనకు దూరమైన ఇంటిపేరును.. తాను ఎర్రచందనం సామ్రాజ్యాన్ని శాసిస్తున్న క్రమంలో అదే అతనికి ఎలా శాపంగా మారిందో.. అడుగడుగునా తనకు బాధను ఎలా గుర్తుచేసింది అన్నది చిత్రం సారంశం. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. హిందీలో ఈ సినిమా ఒక రేంజ్ లో జెండా ఎగరేసింది.

ఇక తమిళంలో కూడా 30 కోట్లు వసూలు చేసింది. 'బాహుబలి' .. 'బాహుబలి 2' తరువాత, అక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. నిజంగా ఇది ఒక రికార్డేనని చెబుతున్నారు. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దాంతో అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో ఉన్నాడని అంటున్నారు. త్వరలోనే 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pushpa  Allu Arjun  Rashmika mandana  sukumar  DSP  Pushpa The Rise  Pushpa Promotions  Pushpa Tamil  Kollywood  

Other Articles