SS Rajamouli’s RRR gets a release date ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలపై క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం..

Ss rajamouli s magnum opus rrr gets new release date

RRR, Jr NTR, Ram Charan, rrr Janani song, rrr janani video song, Janani song, Janani video, Janani music video, Alluri sitaramaraju, ss rajamouli, rrr video, rrr release date, rrr Mar 25 2022, alia bhatt, Rajamouli Ram charan, Rajamouli NTR, SS Rajamouli poster, Kumaram Bheem, Ajay devgn, Alia Bhatt, MM keeravani, Tollywood, Entertainment, movies

SS Rajamouli's much-awaited period action film RRR will hit the theatres on March 25, 2022, the makers of the movie announced on Monday, January 31. In a statement posted on the film's official Twitter handle, the makers confirmed that the movie release date has been finalised — and the movie will be released on March 25.

ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలపై క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం..

Posted: 01/31/2022 07:32 PM IST
Ss rajamouli s magnum opus rrr gets new release date

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్​ రామ్​ చరణ్​ కాంబినేషన్ లో మల్టీ స్టారర్​గా రూపోందిన భారీ బడ్జెట్ చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్ఆర్‌). పాన్ ఇండియా చిత్రంగా రూపోందిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 7న విడుదల కావాల్సివుంది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకు వచ్చి అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగకుండా కరోనా, ఒమిక్రాన్​, థియేటర్ ఆక్యుపెన్సీ వంటి పలు కారణాలతో వాయిదా పడింది. దీంతో రాజమౌళి అభిమానులకు తోడు అటు మెగా, ఇటు నందమూరి అభిమానులు.. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదల అవుతోందా అంటూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో  మార్చి 18 లేదా ఏప్రిల్​ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని సినీబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏదో ఒక తేదినే రిలీజ్ చేస్తారని అది మార్చి 18 అని ఒక రూమర్​, కాదు కాదు ఏప్రిల్​ 28నే అని మరొక పుకారు సోషల్ మీడియాలో హల్​చల్​ చేశాయి. ఈ పుకార్లన్నింటికి చెక్​ పెడుతూ తాజాగా ఏ తేదిన విడుదల చేయనున్నారో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందులో ఎక్కువగా ఏప్రిల్​ 28న విడుదల కానుందని ప్రచారం జరిగినా  ఆ రెండు కాకుండా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్​ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది.

జూలై 30. 2020న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో విడుదల కూడా వాయిదా పడింది. దీంతో జనవరి 8 2021న విడుదల చేయాలని భావించగా కరోనా రెండో దశ విజృంభించడంతో వాయిదా పడక తప్పలేదు. దీంతో గత ఏడాది అక్టోబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ జనవరి 7, 2022 విడుదలకు సన్నాహాలు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా పలు అన్ని ప్రమోషన్ వర్క్ కూడా చేపట్టిన తరువాత చివరి నిమిషంలో థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీకి అదేశాలు జారీ కావడంతో సినిమాను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక తాజాగా మార్చి 25న ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తున్నామని సినీబృందం అధికారికంగా స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles