Prabhas starrer Salaar revealed Shruti Haasan firstlook శృతిహాసన్ పుట్టినరోజున ప్రభాస్ ‘సలార్’ నుంచి ఫస్ట్ లుక్

Shruti haasan is lost in her thoughts in first look poster of prabhas salaar

shruti haasan, salaar, shruti haasan salaar, prabhas salaar, prabhas, shruti haasan birthday, Prashanth Neel, Twitter, pan-Indian film, Vijay Kiragandur, Hombale Films, Laabam, Vijay Sethupathi, shruti haasan age, shruti haasan movies, Tollywood, Movies, Entertainment

On Shruti Haasan’s 36th birthday, actor Prabhas released her first look from the upcoming film Salaar. In the poster, it is revealed that Shruti’s character is called Aadya. She looks lost in her thoughts and her face has a certain calmness in the photo. Sharing the poster, Prabhas wrote, “Wishing my entertaining heroine, the energy ball on set @shrutzhaasan , a very Happy Birthday! #Salaar.”

శృతిహాసన్ పుట్టినరోజున ప్రభాస్ ‘సలార్’ నుంచి ఫస్ట్ లుక్

Posted: 01/28/2022 07:50 PM IST
Shruti haasan is lost in her thoughts in first look poster of prabhas salaar

అందాల అమ్మడు శ్రుతి హాసన్ కి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. అయితే మధ్యలో ఆమె కెరియర్ కాస్త గాడి తప్పింది. తిరిగి తన కెరియర్ ను గాడిలో పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్న ఆమెకి 'క్రాక్' హిట్ చాలా హెల్ప్ అయింది. ఆ తరువాత ఆమె అంగీకరించిన సినిమానే 'సలార్'. పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా  నిర్మితం అవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కి ఛాన్స్ దొరకడం నిజంగా ఆమె అదృష్టమే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది గనుక, తన కెరియర్ కు హెల్ప్ అవుతుందని అమె యోచిస్తోంది.

అమె సినిమా అవకాశఆలు మరింత పుంజుకుంటుందనే బలమైన నమ్మకంతో ఉంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపుతూ వచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండనుంది? ఆమె లుక్ ఎలా ఉండనుంది? అనే ఆసక్తి అందరిలోను ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆమె 'ఆద్య' అనే పాత్రలో కనిపించనుందని చెబుతూ, ఆమె లుక్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో శ్రుతిహాసన్ కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలోను .. చిరంజీవి - బాబీ ప్రాజెక్టులోను నాయికగా ఆమె పేరే వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles