Power Star Puneeth dies after suffering heart attack కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు.!

Kannada actor puneeth rajkumar critical after massive heart attack

Puneeth Rajkumar, Puneeth Rajkumar health live updates, puneeth rajkumar death, puneeth rajkumar death news, kannada puneeth Rajkumar, actor puneeth rajkumar death, puneeth rajkumar died, Puneeth Rajkumar health news, Puneeth Rajkumar critical, power star, health updates, puneeth rajkumar live updates, puneeth rajkumar news, karnataka news, vikram hospital, puneeth rajkumar death, puneeth rajkumar dies, sandalwood, Movies, Entertainment

Popular Kannada actor Puneeth Rajkumar has died after suffering a massive heart attack on Friday morning. Puneeth Rajkumar was rushed to the hospital after the heart attack. Dr Ranganath Nayak of the Vikram Hospital in Bengaluru said Puneeth Rajkumar was admitted at 11.30 am on Friday. He complained of chest pain and was non-responsive upon arrival at the hospital.

పరమపదించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.!

Posted: 10/29/2021 02:58 PM IST
Kannada actor puneeth rajkumar critical after massive heart attack

ప్రముఖ కన్నడ నటుడు.. శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు. కన్నడ సినీపరిశ్రమకు చెందిన అగ్రహీరో మరణంతో శాండిల్ వుడ్ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కర్ణాటక వ్యాప్తంగా కోట్లాదిమంది పునీత్ అభిమానులు శోకసంధ్రంలో మునిగారు. ఆయన ఆకస్మిక మరణంతో రాష్ట్రవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబసభ్యులు తీవ్ర దిగ్బ్రాంతిలోకి జారుకున్నారు. ఆసుపత్రి ఎదుట అభిమానులు గుండెలు బాదుకుంటూ భోరున విలపిస్తున్నారు. 

ఇవాళ ఉదయం యధావిధిగా జిమ్ కు వెళ్లిన ఆయనకు హఠాత్తుగా గుండెపోటు సంభవించడంతో కుప్పకూలిపోయారు. తీవ్రస్థాయిలో ఛాతి నొప్పి రావడంతో పునీత్ రాజ్కుమార్ ను ఆయన వ్యక్తిగత సహాయకులు, జిమ్ సిబ్బంది వెంటనే బెంగళూరులోని విక్రమ్ అసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన వైద్యులు.. ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్సను అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఉయదం యధావిధిగా ఆయన జిమ్‌ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని ఆయన వ్యక్తిగత సహాయక సిబ్బంది, జిమ్ సిబ్బంది తమ అసుపత్రికి పునీత్ రాజ్ కుమార్ ను సుమారు 11.30 నిమిషాలకు తీసుకువచ్చారని అసుపత్రి వర్గాలు తెలిపారు. అయితే ఆయన అసుపత్రికి రావడమే అపస్మారక స్థితిలో వున్నారని, ఆయనను కాపాడుకునేందుకు తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని వైద్యవర్గాలు తెలిపాయి. పునీత్ కు చికిత్స అందించేందుకు నిపుణులైన వైద్య బృందం కూడా వెనువెంటనే వచ్చి చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోయిందని వారు అవేదన వ్యక్తం చేశారు.

46 ఏళ్ల పునీత్ కు గుండెపోటు వచ్చిందని తెలియడంతో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మె హుటాహుటినా అసుపత్రికి చేరుకుని ఆయన అరోగ్య పరిస్థితిని తెలుసుకునే క్రమంలో పునీత్ ఇకలేరన్న వార్త బయటకు వచ్చింది. దివంగత మహానటుడు రాజ్ కుమార్ మూడవ తనయుడైన పునీత్ రాజ్ కుమార్ కన్నడ నాట అగ్రహీరోగా గుర్తింపు పొందారు. అసుపత్రి వద్దనుంచే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కర్ణాటక వ్యాప్తంగా సినీ థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. కన్నడ సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాలనటుడిగా ప్రస్థానం ఆరంభించిన పునీత్ రాజ్ కుమార్ 1985లో వచ్చి బెట్టాడ హూవు చిత్రానికి గాను చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. 2002లో వచ్చిన అప్పు చిత్రం ద్వారా హీరోగా తెరంగ్రేటం చేసిన పునీత్.. 29 చిత్రాల్లో నటించారు. ఆయన చివరగా నటించిన చిత్రం యువరత్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puneeth Rajkumar  heart attack  Vikram Hospital  Gym  cardiac arrest  celebrities mourn  sandalwood  

Other Articles