Jr NTR and Ram Charan's RRR Glimpse video out పంబరేపుతున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ గ్లింప్స్.!

Ss rajamouli reveals rrr glimpse video starring ram charan and jr ntr

RRR, Jr NTR, Ram Charaz, RRR glimpse video, rrr glimpse video new, RRR glimpse, Alluri sitaramaraju, ss rajamouli, rrr video, rrr release date, rrr October 13 Jan 7 2022, alia bhatt, Rajamouli Ram charan, Rajamouli NTR, SS Rajamouli poster, Kumaram Bheem, Ajay devgn, Alia Bhatt, MM keeravani, Tollywood, Entertainment, movies

2022 is set to begin with the year’s biggest blockbuster, RRR. The film is helmed by the very talented director SS Rajamouli. The makers ahead of the film’s release have planned to unveil a special glimpse of the film starring Ajay Devgn, Alia Bhatt, Jr. NTR, and Ram Charan. The Telugu-language period action drama film is produced by D. V. V. Danayya of DVV Entertainments.

పంబరేపుతున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ గ్లింప్స్.. రిలీజ్ డేట్ కన్సామ్.!

Posted: 11/01/2021 12:26 PM IST
Ss rajamouli reveals rrr glimpse video starring ram charan and jr ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపోందుతున్న భారీ బడ్జెట్, మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం, రణం, రుధిరం’. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు తమ ముందుకు వస్తుందా అంటూ అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అభిమానులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం అనుకున్న తేదీకి ప్రపంచవ్యాప్త తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. అన్న అనుమానాలు రేకెత్తాయి. తాజాగా రాజమౌళి మార్క్ లో విడుదలై ఉవెత్తున్న అంచనాలను పెంచేసిన గ్లింప్స్ వీడియో.. విడుదల తేదీని కన్ఫామ్ చేసింది.

రాజమౌళి దర్శకత్వంలో రూపోందుతున్న మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం కావడంతో అభిమానుల ఆసక్తిని గమినించిన చిత్రబృందం ఇవాళ.. గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ రూపోందిస్తున్న రాజమౌళి మార్కు దర్శకత్వంతో పాటు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సహా అలియా భట్ కూడా ఈ గ్లింప్స్ వీడియోలో కనబడుతున్నారు. ఈ చిత్రం గ్లింప్స్ వీడియోకు బ్యాక్ గ్రౌండ్స్ స్కోరింగ్ కూడా కట్టిపడేసేలా వుండటం మరో ప్రత్యేకత.

ఈ వీడియో చూస్తేంటేనే పంబరేపుతుండగా, ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలా ఉంటుందో.. ఊహకు అందని విధంగా అంచనాలను పెరుగుతున్నాయి. ఈ చిత్రం న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న చందాన తెర‌కెక్కిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. హాలీవుడ్ స్థాయిలో జక్క‌న్న స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించిన‌ట్టు తెలుస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ‌మౌళి అద‌రగొట్టారు. ఈ వీడియోని చూస్తుంటే ఆర్ఆర్ఆర్ టీం అభిమానుల‌కి ప‌సందైన వినోదం అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌.. పోలీసు అధికారిగా ప్లాష్ బ్యాక్ లో అల్లూరి సీతారామ‌రాజుగా కనిపిస్తుండ‌గా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలీవియా మోరిస్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భట్ న‌టించింది. ఇక అక్టోబర్ 13న దసరా కానుకగా రావాల్సిన చిత్రం జనవరి 7న వస్తూ తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి పండుగను వినోదాన్ని వారం రోజుల ముందుగానే అందించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  Ram Charan  SS Rajamouli  RRR glimpse video  RRR glimpse  Ajay devgn  Alia Bhatt  MM keeravani  Tollywood  

Other Articles