Sam deletes pics with Chai from her Insta నాగచైతన్యతో తానున్న చిత్రాలను తొలగించిన సామ్

Samantha deletes pictures with naga chaitanya from her instagram account

Samantha Ruth Prabhu, Naga Chaitanya, Samantha Ruth Prabhu Naga Chaitanya, Samantha Ruth Prabhu Naga Chaitanya separation, Samantha, Naga Chaitanya, Instagram, deletes Chai Pics, Pic with Chai, Naga Chaitanya wife, Samantha pics. Tollywood, Movies, Entertainment

Actor Samantha Ruth Prabhu has deleted nearly all her pictures on Instagram with Naga Chaitanya, weeks after the couple's separation. Samantha has deleted photos from their wedding and also several others from their holidays together.

నాగచైతన్యతో తానున్న చిత్రాలను తొలగించిన సామ్

Posted: 10/28/2021 04:34 PM IST
Samantha deletes pictures with naga chaitanya from her instagram account

మోస్ట్ క్రేజీ క‌పుల్‌గా ఉండే స‌మంత‌-నాగ చైత‌న్య వివాహబంధానికి అక్టోబ‌ర్ 2న తెర‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ రోజున అధికారికంగా సమంత తన విడాకుల విషయాన్ని నిర్థారించింది. అయితే ఇప్పటికీ వీరిద్ద‌రు విడిపోయిన విష‌యాన్ని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేక‌ పోతున్నారు. ఏం మాయ చేసావే చిత్రంతో ఇటు తెలుగు ప్రేక్షకులను తమ అభినయంతో మాయ చేసిన సమంత.. నాగ చైతన్యను తన ప్రేమబంధీని చేసింది. ఈ బంధం నిండు నూరేళ్లు వర్థిల్లాలని అందరూ దీవించారు.

నాగ చైతన్యతో మూడు చిత్రాలలో నటించి నిజ జీవితంలోనూ తన కొంగుకు కట్టేసుకుందని అంతా భావించారు. అవకాశం దొరికినప్పుడల్లా వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు సమంత తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసి.. తమ అనోన్యతను చాటుకుంటూ ఉండేది. అంతేకాదు రూఫ్ గార్డెన్, పెట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అనేక ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చిన సమంత.. ఏకంగా తాను నాగచైతన్యాతో విడిపోతున్నానంటూ వస్తున్న వార్తలపై అక్టోబర్ రెండునే స్పందించింది.

ఆ వార్తల్లో నిజముందని, తాను నాగచైతన్య విడిపోతున్నామని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి షాకింగ్ న్యూస్ అభిమానులను విస్మయానికి గురిచేసింది. కట్ చేస్తూ సమంత తాజాగా నాగచైతన్యతో వున్న జ్ఞాపకాలను కూడా తుడిచేయాలని భావిస్తోందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకు కారణం నాగ చైతన్యతో కలిసి ఉన్న దాదాపు 80 చిత్రాలను తొలగించడమే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ – పెట్ డాగ్స్ తో ఉన్న ఫొటోలను కాకుండా..ఇద్ద‌రు కలిసి ఉన్న ఫోటోలను మాత్రమే మెల్ల‌గా తొల‌గిస్తున్న‌ట్టు స‌మాచారం. రానున్న రోజుల‌లో వాటిని పూర్తిగా తొల‌గిస్తుంద‌ని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles