Rajinikanth gets Phalke Award: ‘I am nobody without my fans’ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వారికే అంకితం: రజనీకాంత్

Rajinikanth receives dadasaheb phalke award dedicates it to bus driver friend

rajinikanth, rajini, dadasaheb phalke award, dadasaheb phalke, rajinikanth dadasaheb phalke award, Venkaiah Naidu, national film awards, national film awards rajinikanth, 67th national film awards, rajinikanth, dadasaheb phalke award, Tamil superstar, Kollywood Actor, Balachander, Bus Driver Raj bahadur, national awards

Superstar Rajinikanth was conferred with the Dadasaheb Phalke Award at the Vigyan Bhawan in New Delhi during the 67th National Film Awards ceremony. Rajinikanth used to work as a bus conductor before he joined the film industry, and the actor dedicated the award to his old friend, a bus driver, who encouraged him to pursue acting as a career.

ప్రతిష్టాత్మక అవార్డును ప్రాణప్రదమైన వ్యక్తులకు అంకితం: రజనీకాంత్

Posted: 10/25/2021 08:51 PM IST
Rajinikanth receives dadasaheb phalke award dedicates it to bus driver friend

సినీప‌రిశ్ర‌మ‌లో దాదాపు నాలుగు ద‌శాబ్ధాల‌కుపైగా సేవ‌లు అందించిన ర‌జ‌నీకాంత్ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేశారు. సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న ర‌జ‌నీకాంత్‌కి ఈ విశిష్ట గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఒకే ఏడాదిలో రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల సూపర్‌స్టార్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్‌ అసురన్‌ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. కాగా, ర‌జ‌నీకాంత్ కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా సినీ పరిశ్రమలో నిజంగానే సూపర్ స్టార్ అనిపించుకున్నారు ర‌జ‌నీకాంత్. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తలైవా. అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లేముందు రజనీకాంత్‌ స్థానిక ఫోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు తనకు లభించడం సంతోషంగా ఉందని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

ఇలాంటి శుభతరుణంలో తన గురువు కె.బాలచందర్‌ లేకపోవడం ఎంతో బాధగా ఉందన్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప అవార్డు రావడం సినీ ప్రేక్షకులు, తమిళ ప్రజల ఆదరాభిమానాల వల్లే సాధ్యమైంది అని అన్నారు. ఈ సందర్బంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును తన గురువు, మార్గదర్శి కె.బాలచందర్ కు, తన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ కు, తాను బస్ కండక్టర్ గా పనిచేసినప్పుడు డ్రైవర్ గా వ్యవహరించిన రాజ్ బహదూర్ కు అంకితం ఇస్తున్నాట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles