Character artist Raja Babu passes away at 64 టాలీవుడ్ లో మరో విషాదం.. నటుడు రాజాబాదు కన్నమూత

Senior telugu actor raja babu passes away at 64

tollywood actor raja babu is more, actor raja babu dies at 64, senior actor raja babu is no more, tollywood actor raja babu, actor raja babu, Raja Babu, popular character artist, movie artist, TV Artist, Movies, Serials, tollywood actor, drama artist, East Godavari, Tollywood

Noted Telugu actor Raja Babu passed away after battling ailments for several years. According to his family members, the 64-year-old breathed his last on October 24. After having primarily worked in TV shows, Raja Babu gained fame following his lead roles in some acclaimed films.

టాలీవుడ్ లో మరో విషాదం.. నటుడు రాజాబాదు కన్నమూత

Posted: 10/25/2021 12:22 PM IST
Senior telugu actor raja babu passes away at 64

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో వరుస విషాదాలు చిత్రసీమకు చెందిన ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కరోనా రెండో దశ నుంచి వరుస విషాదవార్తలతో చిత్రసీమ అందోళన చెందుతోంది. 24 క్రాప్ట్స్ లోని ప్రముఖలు మరణాలతో విషాదం అలుముకుంది. కాగా తెరముందు కనిపించే నటీనటుల మరణాలు తెలుగు సినీ అభిమానులు, ప్రేక్షకులను కూడా విషాదంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాజబాబు మరణవార్తతో తెలుగు సినీపరిశ్రమలో విషాదం అలుముకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొంతుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు.

ఈదివారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న ఆయన పరిస్థితి విషమించింది. దీంతో ఆయన సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. 64 ఏళ్ల ఆయనకు భార్య, ఇద్దరు కమారులు, కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేట. రంగస్థల నటుడిగా ఆయన తన నట జీవితాన్ని ప్రారంభించారు. పలు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. 1995లో వచ్చిన ఊరికి మొనగాడు చిత్రంతో రాజబాబును సినిమా రంగానికి పరిచయం అయ్యారు.

సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. దాదాపు 62 చిత్రాల‌లో న‌టించిన ఆయ‌న విభిన్న‌మైన పాత్రలు పోషించారు. పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు రాజ‌బాబు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి వంటి సీరియ‌ల్స్ న‌టించిన ఆయ‌న‌కు నంది అవార్డ్ కూడా ద‌క్కింది. రాజబాబును అందరూ బాబాయ్‌ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద షాకింగ్‌గా మారింది. రాజబాబు మృతిపై ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles