Saami Saami, A Naatu Song From Pushpa ‘పుష్ఫ’ నుంచి అదరగొడుతున్న మరో సాంగ్

Pushpa song saami saami fans go gaga over allu arjun s crackling chemistry with rashmika

Pushpa, Allu Arjun, Rashmika Mandana, sukumar, Mythri movie makers, Devi Sri Prasad, Pushpa, Allu Arjun, Sukumar, Mythri Movie Makers, Pushpa news, Saami, SaamiSaami Song, SaamiSaami Video song, SaamiSaami full video Song, SaamiSaami Song Reaction, SaamiSaami Song Lyrics Telugu, SaamiSaami Telugu Song Released, SaamiSaami full song, Pushpa movie latest, Pushpa Allu Arjun, Pushpa Raj, Rashmika Mandanna, Fahadh Faasil, Tollywood, movies, Entertainment

Pushpa's new song, Saami Saami, which the Director Sukumar, music composer Devi Sri Prasad and the rest of the team dropped today, has become an instant chartbuster, raking up views and likes like nobody's business. And one of the major aspects that is attracting almost anyone who's watching the song like a magnet is the sizzling chemistry of lead stars Allu Arjun and Rashmika Mandanna coupled with their sexy dance steps and seductive expressions.

అల్లు అర్జున్ ‘పుష్ఫ’ నుంచి ‘సామి సామి’ ధర్డ్ సింగిల్

Posted: 10/28/2021 01:38 PM IST
Pushpa song saami saami fans go gaga over allu arjun s crackling chemistry with rashmika

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. రెండు బాగాలుగా పాన్ ఇండియా చిత్రంగా బాహుబలి తరహాలో రానున్న ఈ చిత్రం తొలి భాగం ఇప్పటికే షూటింగు పార్టును ముగించుకుని పోస్టు పోడక్షన్ పనుల్లో నిమగ్నం అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు సింగిల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఊపేస్తున్నాయి

‘‘వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి.. పులిని తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటది కాళీ.. ఇది మహా అకలి.. దాక్కో దాక్కో మేక.. పులోచ్చి కోరుకుద్ది పీక..’’ అన్న పాటతో పాటు ‘‘నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే.. నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే.. కనిపించని దేవుడినే కన్నార్పక చూస్తావే.. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే.. చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే..  చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయేనే.. ’’ అన్న పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చుతున్నాయి. ఇక తాజాగా సామి సామి అనే మూడవ సింగిల్ ను విడుదల చేసింది చిత్రబృందం.

‘‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నా సామి.. నిన్ను సామి సామి అంటుంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి.. నా సామి.. నీ వెనకే వెనకే అడుగేస్తుంటే.. వెంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి.. నీ పక్క పక్కనా కూసుంటుంటే పరమేశ్వరుడి దక్కినట్టుగుందిరా సామి..నువ్ ఎళ్లే దారే సూస్తావుంటే ఏరే ఎండినట్టుగుందిరా సామీ..’ అంటూ సాగే ఈ మూడో పాట శ్రోత‌ల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. విజువ‌ల్స్ చాలా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలో విడుదలైన ఈ సాంగ్‌కి కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh