Naga babu sensational comments in Resignation letter నాగబాబు రాజీనామా లేఖలో సంచలన వ్యాఖ్యలు

Maa elections 2021 mega brother nagababu says he worried over maa future

Nagababu, Prakash raj, maa elections 2021, MAA Elections 2021 nagababu resignation nagababu resignation to maa prakash raj Manchu Vishnu maa president manchu vishnu nagababu nagababu resignation letter maa elections 2021 winners, maa elections, maa elections 2021 date, maa president telugu election, maa association president election, jeevitha, prakash raj, manchu vishnu, maa news, maa president, maa association president, jayasudha, sudigali sudheer, srikanth, prakash raj news, tollywood, movies, entertainment

Mega Brother, Producer and Actor Nagababu Resigns to MAA Membership.. his resignation letter goes viral on net as he made sensational comments in it. Naga Babu says he is worried over MAA Future and promises to travel with Prakash Raj. Yesterday Mega brother wrote that MAA is filled with narrow mindedness and regional feelings.

‘మా’ భవిష్యత్తు తలచుకుంటే భయమేస్తోంది: మెగాబ్రదర్ నాగబాబు

Posted: 10/12/2021 02:58 PM IST
Maa elections 2021 mega brother nagababu says he worried over maa future

‘మా’ ఎన్నికలలో ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ కు మద్దత్తుగా నిలిచిన సినీన‌టుడు, మెగాబ్రదర్ నాగ‌బాబు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారన్న వార్తల నేపథ్యంలో నెట్టింట్లో మెగాబ్రదర్ రాజీనామా లేఖ విపరీంగా చక్కర్లు కొడుతోంది. ‘మా’ అసోసియేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంతో తాను ప్రకాశ్ రాజ్ ఫ్యానల్ కు తొలి నుంచి మద్దుతునిచ్చానని చెప్పిన ఆయన ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

తన రాజీనామా నిర్ణయం ఎంతో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా పూర్తి చిత్తశుద్ది తో తీసుకున్నదని అన్నారు. ఇక ఆయన రాజీనామా లేఖ సారాంశమిలా సాగింది.. 'ఏ వ్యత్యాసం లేకుండా అసోసియేషన్‌లో అందరం ఒక్కటిగా ఉండాలి అని నమ్మేవారిలో నేను కూడా ఒకడిని. అందుకే ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారిని 'మా'లో కలిపేసుకొని వారికి 'మా' అనే మరో ఇంటిని అందించాం. ఒకప్పుడు మా కు నేను అధ్యక్షుడిగా పోటీ చేయడానికి ఇదే ముఖ్య కారణం. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లోని సభ్యుల్లో వచ్చిన మార్పులు నన్ను ఆశ్చర్యానికి గురిచేసాయి'. అని నాగబాబు పేర్కోన్నారు.

'మాలో ఎంత పక్షపాతం ఉందో తెలుసుకోవడానికి ఎంతోమందికి ఈ ఎలక్షన్స్ సహాయపడ్డాయి. బలం, ధనం అనే ఉచ్చులో కూరుకుపోయి మా సభ్యులు ప్రాంతాల తేడాను చూపించడం మొదలుపెట్టారు. వీటి వల్ల ఇలాంటి అసోసియేషన్ నుండి వెళ్లడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ప్రాంతం, మతం అని వారి గోతులు వారే తవ్వుకుంటున్న ఈ అసోసియేషన్‌కు నేను గుడ్ బై చెప్తున్నాను.' అని పేర్కన్నారు. ఇక మా భవిష్యత్తును తలచుకుంటేనే భయమేస్తోందని కూడా నాగబాబు అందోళన వ్యక్తం చేశారు.

'ప్రకాశ్ రాజ్ లాంటి గొప్ప వ్యక్తులకు తోడుగా నేను ఎప్పుడు నిలబడతాను. ఆయన దేనికి అండగా నిలబడినా, దేనికోసం పోరాడినా.. అందులో ఆయనకు తోడుగా నేను ఉంటాను. గతంలో జరిగిన వాటికి నేను విచారించట్లేదు. కానీ భవిష్యత్తులో మా ఎలా ఉంటుందో అని భయపడుతున్నాను. అందుకే ఇప్పుడే దీని నుండి తప్పుకుంటున్నాను. అందరికీ గుడ్ బై' అని నాగబాబు తన లెటర్‌లో చెప్పారు. నాగబాబు తీసుకున్న నిర్ణయంపై అభిమానులు, నెటిజన్లు నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh