'Deeper meaning' behind quitting MAA': Prakash Raj రాజీనామా వెనుక లోతైన అర్థం వుంది: ప్రకాశ్ రాజ్

Prakash raj says there s a deeper meaning behind quitting maa

Prakash Raj ready to act with Manchu Vishnu, Prakash Raj loses, Prakash resigns from MAA membership, Prakash Raj loses in MAA Elections, maa elections 2021, maa elections, maa elections 2021 date, maa president telugu election, maa association president election, jeevitha, prakash raj, manchu vishnu, hema actress, maa news, maa president, maa association president, prakash raj news, tollywood, movies, entertainment

Actor Prakash Raj has said that there is a deeper meaning behind his resignation from Tollywood's influential industry body, Movie Artists Association (MAA). Thanking the members who had supported him and his panel in the just-concluded MAA elections,

రాజీనామా వెనుక లోతైన అర్థం వుంది: ప్రకాశ్ రాజ్

Posted: 10/12/2021 04:06 PM IST
Prakash raj says there s a deeper meaning behind quitting maa

ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలు ముగిసినా.. వాటి చుట్టూ అలుముకున్న వివాదాలు మాత్రం ఇప్పుడే ముగిసేలా లేవు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు తన రాజీనామా లేఖను అన్ లైన్ లో పెట్టగా, ఇక తాను కూడా నాగబాబు బాటలోనే పయినించిన ప్రకాశ్ రాజ్.. కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే తాను ఓటమిని చవిచూడటం కారణంగా బాధతోనో.. లేక భావోద్వేగంలోనో తీసుకున్న నిర్ణయం కాదని.. అనాలోచిత నిర్ణయం అంతకాన్నా కాదని ప్రకాశ్ రాజ్ పేర్కోన్నారు.

మా అధ్యక్ష ఎన్నికలలో తాను అకస్మాత్తుగా రాలేదని, ఏడాదిగా గ్రౌండ్‌ వర్క్‌ చేస్తూ వచ్చానని నిన్న చెప్పిన ఆయన.. తన రాజీనామా బాధతో తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. అయితే తన రాజీనామాపై మా నూతన అధ్యక్షుడు విష్ణు వ్యతిరేకంగా స్పందించి.. దానిని అమోదించనని మీడియా ముఖంగా చెప్పారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్ తన రాజీనామాపై సానుకూలంగా స్పందించి అమోదించాలని కోరుతున్నాని అన్నారు. తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టమన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటానని ప్రకటించారు.

కాగా మా అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా ప్రాంతీయత ఆధారంగా జరిగాయని అన్నారు. అయితే ప్ర‌కాశ్ రాజ్ నిర్ణ‌యాన్ని తాను స్వాగ‌తించ‌డం లేద‌ని, మీతో క‌లిసి ముందుకు సాగాలని తాను కోరుకుంటున్న‌ట్టు విష్ణు పేర్కొన్నారు. కాగా ప్ర‌కాశ్ రాజ్ రీసెంట్‌గా త‌న ట్విట్ట‌ర్‌లో.. మా సభ్యత్వానికి తాను రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉందని, అదేంటో త్వరలోనే తెలియజేస్తానని తెలిపారు. మాకు మద్దతుగా నిలిచిన ‘మా’ సభ్యులకు నమస్కారం. నేను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉంది. మిమ్మల్ని మేం నిరాశ పరచం. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా’ అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles