వరుసగా విషాదాలతో తెలుగు సినీ పరిశ్రమకు సేవలు అందించిన ఎందరో మహానుభావులు దూరం అవుతున్నారు. సినీనిర్మత, జూనియర్ ఎన్టీఆర్ (తారక్) పీఆర్ గా సేవలు అందించిన మహేశ్ కోనేరు ఆకస్మిక మరణం టాలీవుడ్ పరిశ్రమను కుదిపేసింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ మహేశ్ కోనేరు ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. విశాఖపట్నంలోని ఆయన తన నివాసంలో ఉన్న మహేశ్ ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో ఇబ్బందిపడ్డాడు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహేశ్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రివ్యూయర్, సినీ జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించిన ఆయన ‘కంచె’ సినిమాతో ప్రచారకర్త, మార్కెటింగ్ వ్యూహకర్తగా మారారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా, పీఆర్ఓగా ఆయన పనిచేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి చిత్రాలను నిర్మించారు. 118, తిమ్మరుసు, మిస్ ఇండియా చిత్రాలను నిర్మించారు. ఇక ఆయన నిర్మాణ సారథ్యంలోని ‘సభకు నమస్కారం’, ‘పోలీసువారి హెచ్చరిక’ చిత్రాలు నిర్మాణ దశలో వున్నాయి.
చిత్రపరిశ్రమలో ఎందరెందరితోనే చక్కని సంబంధాలు కలిగిన ఆయన ఆకస్మిక మరణంతో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. కోనేరు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ‘‘మహేశ్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నా.. నా చిరకాల మిత్రుడు అప్పుడే దూరం కావడం.. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ షాక్ తో నోట మాట రావడం లేదు. బరువెక్కిన గుండెతో ఆయనకు నివాళులు ఘటిస్తున్నా.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’’.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ బాధతప్త హృదయంతో ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more