Manchu Vishnu responds on Prakash Raj Resignation ప్రకాశ్ రాజ్ రాజీనామాపై మంచు విష్ణు స్పందన

Maa elections 2021 manchu vishnu responds on prakash raj resignation

MAA Elections, MAA Elections 2021, Manchu vishnu on Prakash Raj resignation, Manchu Vishnu responds on Prakash raj resignation, manchu vishnu Prakash Raj MAA Elections, MAA Elections winners, MAA Elections 2021 winners, MAA Elections news, MAA Elections updates, Manchu Vishnu MAA Elections latest updates, Tollywood, Movies, Entertainment

The aftermaths of prestigious MAA Elections have been talk of the town as Mega brother Nagababu and the defeated president Prakash Raj had resigned for MAA memberships. Manchu Vishnu had responded on the issue and said he wouldn't accept the resignations.

‘మా’ ఎన్నికలు 2021: ప్రకాశ్ రాజ్ రాజీనామాపై స్పందించిన మంచు విష్ణు

Posted: 10/11/2021 05:59 PM IST
Maa elections 2021 manchu vishnu responds on prakash raj resignation

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ నూతనాధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు.. అధ్యక్షబరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్ కూడా ఎన్నికలలో పోటీపడి ఓటమిని చవిచూసిన తరువాత ఇవాళ ఉధయం మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంచువిష్ణు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో స్థానికేతరులు ఎన్నికలలో పాల్గోనకుండా ‘మా’లో మార్పులు తీసుకువస్తానని కూడా చెప్పారని, ఈ నేపథ్యంలో తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అన్నారు.

అయితే దీనిపై మంచు విష్ణు స్పందించారు. తనకు ప్రకాశ్ రాజ్కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ స్ర్కీన్ షాట్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. భావోద్వేగంలొ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని తెలిపారు. ‘మా’ భవిష్యత్తు కోసం మనం ఎప్పటికీ ఒక్కేటే నంటూ తాను ప్రకాశ్ రాజ్ కు పోస్టు చేశారు. ఇక వీరిద్దరి మధ్య సాగిన వాట్సాఫ్ చాట్ ఇలా ఉంది. ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణుకు అభినందనలు తెలిపిన ప్రకాశ్ రాజ్.. తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన నిర్ణయాన్ని ఆమోదించాలని విష్ణును కోరారు. సభ్యత్వం లేకపోయినా తన సహాయం కావలసినప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు.

అయితే ఈ నిర్ణయంతో తాను సంతోషంగా లేనని విష్ణు తెలిపారు. గెలుపోటములు సహజమని, ఇలా భావోద్వేగంలో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ప్రకాశ్ రాజ్‌కు వివరించారు. తమ కుటుంబంలో ప్రకాశ్ రాజ్‌ ముఖ్యమైన వ్యక్తని, ఆయన ఆలోచనల అవసరం తనకు ఉంటుందని అన్నారు. కలిసి పనిచేద్దామని చెప్పారు. అలాగే తనకు వాట్సాప్‌లో బదులివ్వొద్దని, తాను సమయం చూసుకొని స్వయంగా ప్రకాశ్ రాజ్‌ను కలిసి ఈ విషయంపై మాట్లాడతానని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles