Megastar unveils trailer of Sai Tej’s Republic సాయితేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ లాంచ్ చేసిన చిరంజీవి

Chiranjeevi unveils sai dharam tej s firebrand republic trailer

Republic, Trailer launch, Republic Trailer launch, Megastar Chiranjeevi, chiranjeevi launched Republic trailer, Sai Dharam Tej, Aishwarya Rajesh, Jagapathi Babu, Ramya Krishna, Deva Katta, Mani Sharma, J B Entertainments, Tollywood, movies, Entertainment

Tollywood Megastar Chiranjeevi unveils the trailer of the upcoming film Republic, which stars his nephew Sai Dharam Tej in the lead role. While sharing the trailer on social media, Chiranjeevi said Tej was recovering well at the hospital and sought the support of the audience for the film.

చిరు చేతుల మీదుగా సాయితేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ లాంచ్

Posted: 09/22/2021 11:43 AM IST
Chiranjeevi unveils sai dharam tej s firebrand republic trailer

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సుప్రీం హీరో సాయిధరమ్ హీరోగా నటించిన తాజా చిత్రం రిపబ్లిక్. విభిన్నమైన ప్రత్యేకతలతో వున్న చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు దేవకట్టా తెరకెక్కించిన చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఇవాళ చిత్రబృందం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేసింది. చిత్రంలో సాయితేజ్ పవర్ ఫుల్ కలక్టర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు సహా రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలి పాత్రలో ఇమిడిపోయింది.

ఈ నెల 9వ తేదీన రాత్రి జూబ్లీహిల్స్ కు తన స్పోర్ట్స్ బైక్ పై వస్తున్న సాయితేజ్.. సరిగ్గా కేబుల్ బ్రిడ్జిపై వస్తూ ఐకియా వద్ద రోడ్డుపై ఇసుకను గమనించి బ్రేక్ వేయడంతో బైక్ స్కిడ్ అయ్యి పడిపోయిన ఘటన తెలిసిందే. కాలర్ బోన్ ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. రిపబ్లిక్ చిత్రానికి ప్రమోషన్ వర్క్ చేయలేకపోయారు. అపోలో అసుపత్రిలో చికిత్స చేయించుకన్న ఆయన మరో రెండు మూడు రోజులు అసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. అయినా ఆయనకు రెస్ట్ అవసరం కావడంతో రిపబ్లిక్ చిత్ర ప్రమోషన్ బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి తన భుజాలపై వేసుకుని ఇవాళ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.’’ అంటూ రిపబ్లిక్ ట్రైలర్ ని తన ట్విట్టర్ లో విడుదల చేశారు రిపబ్లిక్ చిత్ర ట్రైలర్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సాయిధరమ్ తేజ్, దేవకట్టా కాంబినేషన్ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించింది. జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles