Kangana Ranaut accuses Javed Akhtar of extortion బాలీవుడ్ నటి కంగనా కోర్టుధిక్కార వ్యాఖ్యలు..

Kangana ranaut tells mumbai court she has lost faith in it

Kangana Ranaut, Javed Akhtar, defamation case, lyricist Javed Akhtar, extortion, criminal intimidation, chief metropolitan magistrate (CMM), Bollywood

The actor Kangana Ranaut in her complaint said following her public dispute with a co-star, Akhtar had called her and her sister Rangoli Chandel to his house with mala fide intentions and ulterior motives and then ‘criminally intimidated and threatened’ her.

బాలీవుడ్ నటి కంగనా కోర్టుధిక్కార వ్యాఖ్యలు..

Posted: 09/21/2021 03:05 PM IST
Kangana ranaut tells mumbai court she has lost faith in it

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఈ మధ్యకాలంలో సినిమాల కన్నా వివాదాస్పద వ్యవహారాల్లోనే ఎక్కువగా నానుతోంది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు గ్రేటర్ ముంబై కార్పోరేషన్ అధికారులపై విరుచుకుపడిన ఆమె.. ఆ వ్యవహారంలోకి ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా లాగారు. ఆ తరువాత బాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖులతోనూ అమె మాటల యుద్దానికి దిగింది. ఇలాంటి వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవ‌ల త‌లైవి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కంగనా ర‌నౌత్‌.. తాజాగా కోర్టు ప‌ని తీరుని త‌ప్పు ప‌ట్టింది. ఏకంగా కోర్టులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాయంటూ అమె ధిక్కార వ్యాఖ్యలకు దిగింది.

అంతటితో ఆగని కంగనా రనౌత్ కోర్టులు బెదిరింపులకు పాల్పడటంతో తనకు న్యాయస్థానాలపై కూడా న‌మ్మ‌కం పొయిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అమె చేసిన కోర్టు ధిక్కార వ్యాఖ్యలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. న్యాయస్థానాల పనితీరునే ప్రశ్నిస్తూ.. అమె చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. సుశాంత్ సింగ్ మ‌ర‌ణించిన స‌మ‌యంలో నెపోటిజంపై కంగ‌నా తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. హృతిక్ రోష‌న్‌, రైట‌ర్ జావెద్ అక్త‌ర్‌ల‌ను ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్‌లో కోట‌రీ వ్య‌వ‌స్థ చాలా బ‌లంగా నాటుకుపోయింది’ అని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. దీనిపై రైట‌ర్ జావెద్ అక్త‌ర్ కంగ‌నా ర‌నౌత్‌పై ప‌రువు న‌ష్టం దావా వేశారు.

ఈ కేసుకి సంబంధించి హాజరుకావాలంటూ ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు. అయితే కోర్టులు జారీ చేసిన సమన్లకు స్పందించని కంగన.. అమె వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించిన క్రమంలో ఎట్ట‌కేల‌కు అంధేరి మెట్రోపాలిటన్ కోర్టుకు హాజ‌రైంది. ఈ కేసులో తనకు బెయిల్ వ‌చ్చే అవ‌కాశం ఉన్నా, ఇవ్వ‌కుండా కోర్టుకి హాజ‌రు కాక‌పోతే అరెస్ట్ చేస్తామ‌ని ప‌రోక్షంగా కోర్టు రెండుసార్లు త‌న‌ను బెదిరించింద‌ని కంగన తెలిపింది. ఈ కేసు ద‌ర్యాప్తు త‌న‌కు వ్య‌తిరేఖంగా సాగుతుంద‌ని చెప్పిన కంగ‌నా, ఈ కేసుని మ‌రోకోర్టుకి బ‌ద‌లాయించాల‌ని చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ముందు అప్పిలు చేసింది. ఈ ద‌ర‌ఖాస్తును అక్టోబ‌ర్ 1న కోర్టు ప‌రిశీలించ‌నుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles