Pelli Sandadi movie trailer released by Mahesh Babu మహేశ్ బాబు చేతుల మీదుగా ‘పెళ్లిసందD’ ట్రైలర్ రిలీజ్

Mahesh babu unveils roshan meka and sree leela starrer pelli sandad trailer

PelliSandaD, Trailer Launch, Pelli SandaD trailer, Mahesh Babu, Roshann, SreeLeela, M. M. Keeravani, K Raghavendra Rao, Gowri Ronanki, Rk Film Associates & Arka Media Works, Tollywood, Movies, Entertainment

Veteran Telugu filmmaker K Raghavendra Rao will be making his acting debut with the film Pelli SandaD, directed by debutant Gowri Ronanki in which Roshan Srikanth and Sree Leela playing the lead roles. After Launching tollywood Superstar shared the trailer on his social media account.

మహేశ్ బాబు చేతుల మీదుగా ‘పెళ్లిసందD’ ట్రైలర్ రిలీజ్

Posted: 09/22/2021 12:36 PM IST
Mahesh babu unveils roshan meka and sree leela starrer pelli sandad trailer

శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా పరిచయం కాబోతున్నారు.  వశిష్ఠపాత్రలో ఆయన సందడి చేయనున్నారు. పెళ్లి సందడి చిత్ర ట్రైలర్ ని తాజాగా మహేష్ బాబు విడుదల చేశారు. పెళ్లిసందడి చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేసిన ఆయన తరువాత దానిని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

ట్రైలర్ లింక్ పోస్టు చేస్తూ.. ‘‘దర్శకుడు రాఘవేంద్రరావు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ చిత్ర ట్రైలర్ ని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్’’ అని మహేష్ తెలిపారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం.  సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, రావురమేశ్, తనికెళ్ళ భరణి, పోసాని, వెన్నెల కిషోర్ రాజీవ్ కనకాల అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh