JA movie trailer promising Horror thriller భయపెడుతున్న హిమ‘జ’ హారర్‌ థ్రిల్లర్‌ ట్రైలర్

Himajas ja movie trailer promising horror thriller

JA Telugu Movie Trailer, JA Telugu Movie, Himaja, ja Movie, ja Movie Trailer, ja Movie Trailers, ja Movie Songs, ja Movie Video Songs, ja Movie Jukebox, ja, ja theatrical trailer, ja trailer, ja teaser, manastars, manastars entertainments, MS Entertainments, Tollywood, movies, Entertainment

Telugu bigboss contestant Himaja playing a lead role in JA movie, promising to be different horror thriller, pratap raj also play a lead role. Jabardast Sudigali sudheer and Getup Srinu also plays key role in the movie. The film Unit released its trailer

భయపెడుతున్న హిమ‘జ’ హారర్‌ థ్రిల్లర్‌ ట్రైలర్

Posted: 07/20/2021 09:51 PM IST
Himajas ja movie trailer promising horror thriller

బిగ్‌ బాస్ ఫేమ్ హిమ‌జ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో ‌జై దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్షన్ నెం.1గా గోవ‌ర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ హారర్‌ థ్రిల్లర్‌ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌ం అవుతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్ టీజ‌ర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. వాటికి ఇదివరకే మంచి రెస్పాన్స్ రావడంతో ఇవాళ తాజాగా  జ మూవీ ట్రైల‌ర్ ను యంగ్ హీరో సుధీర్‌బాబు విడుద‌ల‌చేసి యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

డైలాగ్స్ లేకుండా కేవ‌లం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సాగే ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచనాలను మ‌రింత పెంచింది. ట్రైయిలర్ ఆద్యంతం భయాత్మకంగానే వుంది. ఇందులో జబర్ధస్త్ కమేడియన్ హీరో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు కూడా నటించడం.. అదనపు అట్రాక్షన్ గా మారుతోంది. ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా న‌టి హిమ‌జ మాట్లాడుతూ.. ‘‘ఫుల్ లెంగ్త్ ఫెర్‌ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర కావ‌డంతో ఈ సినిమాను అంగీకరించాను.

న‌టిగా న‌న్ను మ‌రో మెట్టు ఎక్కించే మూవీ ఇది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ గోవ‌ర్ధన్ రెడ్డి గారికి, ద‌ర్శకుడు సైదిరెడ్డి గారికి కృత‌జ్ఞత‌లు" అన్నారు. ద‌ర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ..‘జ’అంటే జ‌న్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి క‌థా బ‌లం ఉన్న మూవీ. మా ప్రొడ్యూస‌ర్ గోవ‌ర్ధన్ రెడ్డి నా మీద న‌మ్మకంతో ధైర్యంగా ముందుకు వ‌చ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఉపేంద‌ర్‌ స‌హ‌కారం మ‌రువ‌లేనిది’ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ja Movie  Himaja  sudigali sudheer  Prathap Raj  Getup Srinu  Saidi Reddy  Vengi  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh