Actor Surekha Sikri dies of cardiac arrest హిందీ బుల్లితెర సీనియర్ నటి సురేఖా సిక్రీ ఇక లేరు

Veteran actress surekha sikri dies of cardiac arrest at 75

Surekha sikri, Surekha sikri dead, surekha sikri dies, surekha sikri passes away, surekha sikri age, surekha sikri cardiac arrest, badhaai ho, balika vadhu, who is Surekha sikri, Surekha sikri photo, Surekha sikri dead cause, Surekha sikri news, Surekha sikri film, Surekha sikri latest news, Bollywood

Three-time National Award-winning actress Surekha Sikri died due to cardiac arrest. She was 75. A statement shared by the late actress' agent revealed that Surekha Sikri was battling complications induced by a second brain stroke. She had been suffering from complications arising from a second brain stroke," the actor's agent Vivek Sidhwani said

హిందీ బుల్లితెర సీనియర్ నటి సురేఖా సిక్రీ ఇక లేరు

Posted: 07/16/2021 05:41 PM IST
Veteran actress surekha sikri dies of cardiac arrest at 75

బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్‌ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సిఖ్రి మరణించిందని ఆమె మేనేజర్‌ మీడియాకు వివరించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి.. శుక్రవారం తుదిశ్వాస విడిచింది. 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్‌ అవార్డులు సంపాదించుకుంది.

బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు)సీరియల్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సిఖ్రి తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. బామ్మగా సిఖ్రి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రాజ‌స్థానీ వృద్ధ మ‌హిళ డోక్రీ త‌ర‌హాలో సురేఖ త‌న దాదిసా పాత్ర‌లో మైమ‌రిపించారు. ఆమె శ‌క్తివంత‌మైన న‌టన‌కు ఎవ‌రైనా ఫిదా కావాల్సిందే. కొన్ని సంద‌ర్భాల్లో అది కోపం కూడా తెప్పిస్తుంది. ఆ సిరీయ‌ల్‌లో ఆనందీ పుస్త‌కాల‌ను ఆమె కాల్చివేస్తుంది.

ఆ స‌మ‌యంలో సిక్రీ న‌ట‌న‌ను చూస్తే.. నేటి త‌రం వాళ్ల‌కు వ‌ళ్లు మండిపోతుంది. అంతేకాదు, ఎమోష‌న‌ల్ సీన్స్‌లో ఆమె పండించే అభిన‌యం.. ఎవ‌రికైనా క‌న్నీళ్లు తెప్పిస్తాయి.2018లో షూటింగ్‌ సమయంలో బాత్రూంలో జారిపడటంతో సురేఖ సిఖ్రికు బ్రెయిన్‌ స్ర్టోక్‌ వచ్చింది. కోలుకుంటున్న సమయంలోనే రెండేళ్ల తర్వాత మరోసారి బ్రెయిన్‌ స్ర్టోక్‌ రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అప్పటినుంచి నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చిన సురేఖ సిఖ్రి చివరిసారిగా ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌ అనే చిత్రంలో నటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : surekha sikri  surekha sikri dies  cardiac arrest  brain stroke  vivek sidhwani  Bollywood  

Other Articles

Today on Telugu Wishesh