పాన్ ఇండియా నటుడు రానా కథానాయకుడిగా 'విరాటపర్వం' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్స్ పనులలో బిజీగా వుంది. రూపొందింది. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా సాయిపల్లవి నటించింది. సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, వేణు ఊడుగుల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 1990లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఆయన ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 'నెట్ ఫ్లిక్స్'లో విడుదల చేయనున్నారనీ, అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వచ్చింది.
తాజాగా ఈ విషయంపై దర్శకుడు వేణు ఊడుగుల స్పందించాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుందని అన్నాడు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే పట్టుదలతోనే నిర్మాతలు ఉన్నారనీ, థియేటర్లు ఓపెన్ అయిన తరువాత, పరిస్థితులు చూసుకుని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పాడు. 'అరణ్య' తరువాత రానా నుంచి వస్తున్న ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more