Aamir Khan, Kiran Rao announce divorce విడిపోతున్న అమీర్ ఖాన్, కిరణ్ రావు జంట

Aamir khan and kiran rao announce divorce to remain friends and co parents

amir Khan, Kiran Rao, divorce, aamir khan wife, aamir khan marriage, Aamir khan divorce news, Aamir khan and kiran rao, Actor Aamir khan, Filmmaker kiran rao, Aamir khan announce divorce, Aamir Khan and Kiran Rao announce separation, kiran rao aamir khan pictures

Superstar Aamir Khan and producer-director Kiran Rao on Saturday announced their decision to get divorced after 15 years of marriage, saying they were ready to start a new chapter as “co-parents and family for each other”.

ఔను మేము విడిపోతున్నాం: అమీర్ ఖాన్, కిరణ్ రావు

Posted: 07/03/2021 08:25 PM IST
Aamir khan and kiran rao announce divorce to remain friends and co parents

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌గా పేరుగాంచిన‌ అమీర్ ఖాన్ దాంపత్య జీవితం మరోసారి ముక్క‌లైంది. తన రెండో భార్య కిరణ్ రావుతో కూడా ఆయ‌న విడిపోయారు. ఈ మేర‌కు తాము విడాకులు తీసుకున్నామంటూ అమీర్‌ఖాన్‌, కిరణ్ రావు సంయుక్తంగా ఒక అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. ఆ ప్ర‌క‌ట‌న‌తో వారి 15 ఏండ్ల‌ వైవాహిక జీవితానికి తెరపడిgది. అమీర్‌ఖాన్ ప‌దిహేనేండ్ల క్రిత‌మే మొద‌టి భార్య‌తో విడిపోయి హైదరాబాద్ కు చెందిన కిర‌ణ్ రావు రెండో వివాహం చేసుకున్నారు.

తాజాగా ఇవాళ అమీర్ ఖాన్, కిరణ్ రావు సంయుక్తంగా ఒక‌ ప్రకటనను విడుదల చేస్తూ.. ‘మా 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో జీవితానికి సరిపడే అద్భుతమైన అనుభవాలను, సంతోషాల‌ను, ఆనందాల‌ను పంచుకున్నాం. మా బంధం నమ్మకం, గౌరవం, ప్రేమ అనే పునాదుల మీద నిల‌బడింది. అయితే ఇప్పుడు మేం మా జీవితాల్లో కొత్త అధ్యాయాల‌ను ప్రారంభించ‌బోతున్నాం. మేమిద్దరం ఎక్కువ కాలం భార్య, భర్తలుగా ఉండలేదు. మా బిడ్డకు తల్లితండ్రులుగా ఉంటూనే వేర్వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.

కాగా, అమీర్ ఖాన్ 1986లో రీణా ద‌త్తాను మొదటి వివాహం చేసుకున్నారు. వారికి కూతురు ఇరా ఖాన్‌, కుమారుడు జునైద్ ఖాన్ ఉన్నారు. 2002లో అమీర్‌ఖాన్‌, రీణా ద‌త్తాలు త‌మ వైవాహిక బంధానికి తెర‌దించారు. 2005లో కిర‌ణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఆజాద్ ఖాన్ అనే కుమారుడు ఉన్నారు. తాజాగా కిర‌ణ్‌రావుతో వైవాహిక బంధానికి కూడా అమీర్‌ఖాన్ తెర‌దించారు. అయితే భార్యాభ‌ర్త‌లుగా విడిపోయినా కుటుంబ‌స‌భ్య‌లుగా ఒక‌రికి ఒక‌రం క‌లిసే ఉంటామ‌ని ప్ర‌కటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  kiran rao  divorce  azad rao khan  

Other Articles